Mangoes: తియ్యగా ఉన్నాయి కదా అని మామిడి పండ్లను తెగ లాగించేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. మామూలుగా మనకు మామిడి పండ్లు వేసవికాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. అయితే బాగా మాగిన మామిడి పండ్లను చాలామంది లొట్టలు వేసుకొని మరీ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దానికి తోడు ఈ మామిడి పండ్లు కేవలం వేసవి కాలం మాత్రమే లభిస్తాయి కాబట్టి చాలామంది మళ్లీ మళ్లీ దొరకవు అని తెగ తినేస్తూ ఉంటారు.

అయితే మామిడి పండ్లు తినడం మంచిదే కానీ, అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు. మామిడి పండ్లతో పాటు కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదు. ఇవి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. మామిడిపండుతో కలిపి కొన్ని ఆహారాలను అసలు తినకూడదట. మరి మామిడి పండు తో ఎలాంటి ఆహార పదార్థాలను కలిపి తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా ఉంది మామిడికాయ పెరుగు కలిపి తింటూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్ లో మ్యాంగో లస్సీ అని చాలా మంది ఎక్కువగా తాగేస్తూ ఉంటారు. కానీ ఈ రెండు కాంబినేషన్ ను కలిపి అసలు తీసుకోకూడదు.

మామిడిపండు, పెరుగు కలిపి తినడం వల్ల కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. ఇది కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే చాలామందికి భోజనంలో మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. ఒకవేళ మీరు మామిడిపండు రాత్రిపూట భోజనంలో తింటే కనుక వెంటనే శీతల పానీయాలు తాగకండి. మామిడి, శీతల పానీయాలను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. మామిడిపండ్లను రాత్రి భోజనంలో లేదా లంచ్‌లో తినడానికి ఇష్టపడతారు. మామిడిపండ్లు తిన్న వెంటనే స్పైసీ ఫుడ్‌ను తినకూడదు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే మామిడిపండు కాకరకాయ కలిపి తీసుకోకూడదు. పచ్చి మిరపకాయలు మామిడికాయలు కలిపి తీసుకోకూడదు.. మామిడిపండ్లు తిన్న వెంటనే కడుపులో చికాకు కలిగే అవకాశముంది. దీనివల్ల విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు అసలు తాగు కూడదు.