ఆస్తమా రోగులు చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల.. పాటించాల్సిన ఆహార నియమాలివే?

చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జలుబు, దగ్గు, జ్వరం ,గొంతు, తలనొప్పి వంటి అనేక సమస్యలతో తరచూ బాధపడుతుంటారు. ఆస్తమా రోగులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. శీతాకాలం తడి వాతావరణం లో ప్రమాదకర బ్యాక్టీరియా ,వైరస్ల అభివృద్ధి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులు, శ్వాస సంబంధిత అలర్జీ సమస్యలు ఉన్నవారిలో తడి వాతావరణం కారణంగా శ్వాస వాహికలో మరియు ఊపిరితిత్తుల్లో అలర్జీల కారణంగా వాపు ఏర్పడి శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బంది కలుగుతుంది. కావున ఆస్తమా రోగులు చలికాలంలో ఆహారం నియమాలు తప్పనిసరిగా పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆస్తమా సమస్యతో బాధపడేవారు వైద్యుల్ని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడంతో పాటు తమ రోజువారి ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి చాలామంది ఎక్కువగా టీ, కాఫీ వంటి పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఆస్తమా సమస్య ఉన్నవారు ఈ పొరపాటు చేయకండి. టీ కాఫీ వంటివి ఎక్కువగా తాగితే గ్యాస్టిక్, ఉభసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉబ్బసం ఆస్తమా సమస్యను మరింత పెంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించవచ్చు.

ఆస్తమా సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా చల్లని శీతల పానీయాలకు, ఐస్ క్రీమ్, చాక్లెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే మసాలా దినుసులను టేస్టీ సాల్టును అధికంగా ఉపయోగించి ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయ జ్యూస్, బత్తాయి, పచ్చళ్ళు వంటివి తక్కువగా తీసుకోవాలి. అలాగే ఉదయం సాయంత్రం శ్వాస నాళాలను బలోపేతం చేసే యోగా ఆసనాలను అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేస్తే అలవాటు ఉన్న ఆస్తమా రోజులు చల్లని వాతావరణం ఉన్న ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట వ్యాయామం చేయడం మంచిది.