మనకి ఇష్టమైన ఆహారం కళ్ళెదుట ఉన్న తినలేని పరిస్థితి చాలామందిని ఇబ్బంది పెడుతుంది. దానికి కారణం జీర్ణశక్తి సరిగా లేకపోవడం వల్ల తిన్న ఆహారం జీర్ణం అవడంలో సమస్య తలెత్తి గ్యాస్ట్రిక్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. దీనికి కారణాలను పరిశీలిస్తే మారుతున్న ఆహారపు అలవాట్లు,శారీరక శ్రమ లేకపోవడం,ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం ,ధూమపానం, మద్యపానం,పని ఒత్తిడితో సమయానికి తినకపోవడం,అతిగా తినడం, వంశపారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అజీర్తి ,గ్యాస్టిక్ సమస్యలతో బాధపడేవారు ఏవేవో మందులు వేసుకుని బాధపడే బదులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్యకు దూరంగా ఉండవచ్చు.
మొదట మీరు చేయాల్సిందల్లా రోజువారి ఆహారంలో ఉప్పు, కారం, మసాలా దినుసులు, కొవ్వు పదార్థాల పరిమాణాన్ని తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మన శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది తద్వారా శరీరంలో నీటి నిల్వలు పెరిగి అజీర్తి సమస్యకు దారి తీయవచ్చు.అత్యధిక చెడు కొలెస్ట్రాల్ ఉండే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఎక్కువగా తింటే జీర్ణం అవడంలో సమస్య తలెత్తి గ్యాస్ట్రిక్, మలబద్దక సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు మొదట వీటిని తగ్గించుకోవాలి.
జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు చిటికెడు సోంపు నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగి జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.ఎన్నో ఔషధ గుణాలున్న మారేడు ఆకులలో కొన్ని మిరియాలు కలిపి చూర్ణంగా చేసుకొని తింటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అల్సర్, క్యాన్సర్ వంటి తొలగిపోతాయి.పచ్చి పసుపు కొమ్ములను పాలల్లో బాగా మరిగించి ఉదయం సాయంత్రం తాగితే జీర్ణ వ్యాధులు తొలుగుతాయి.గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కాకరకాయతో కషాయాన్ని చేసుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది.