మాంసంతో పాటు కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకుంటున్నారా… ఇది తెలుసుకోవాల్సిందే!

సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలా మంది ముక్క లేనిదే ముద్ద దిగదు అనే ధోరణికి వచ్చేసారు. ఇలా ప్రతిరోజు వారి ఆహారంలో భాగంగా మాంసాహారం ఉండాల్సిందే.ఇలా వివిధ రకాలుగా మాంసాన్ని వారి రోజువారి ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే చాలామంది మాంసాహారాన్ని తింటూ కూల్డ్రింక్స్ కూడా తాగే అలవాటు చాలామందికి ఉంటుంది.అయితే ఇలా మాంసం తింటూ కూల్డ్రింక్స్ కనుక అధికంగా తీసుకుంటున్నట్లయితే ఈ సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు.

గత కొన్ని సంవత్సరాలుగా నిపుణులు ఈ విషయంపై పలు అధ్యయనాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ అధ్యయనాలలో భాగంగా ఇలా చికెన్ లేదా మటన్ చాపలతో పాటు కూల్ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ నిపుణులు తెలియజేశారు. అతిగా మాంసం,అధిక కెలోరీలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వారు వెల్లడించారు.

ఈ విధమైనటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే పూర్తిగా మనం ఈ అలవాటును మానుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు బారిన పడకుండా ఉండాలి అంటే మాంసం కూల్ డ్రింక్ రెండు కలిపి అసలు తీసుకోకూడదు.అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే ట్రెండ్ అంటూ మాంసం కూల్ డ్రింక్ కు బానిసలుగా మారిపోయారు అయితే ఇది భవిష్యత్తులో మీకు తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.