అంజీర పండులోని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ..ఆశ్చర్య పోవాల్సిందే?

అంజీర పండ్లు ను కొన్ని ప్రాంతాల్లో అత్తి పండ్లు, మేడిపండు అని కూడా పిలుస్తుంటారు. అంజీర పండ్లలో మన నిత్య జీవక్రియలకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా సహాయపడి అనేక ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. అంజీర పండులో మన శరీరానికి హాని కలిగించే కొవ్వు,పిండిపదార్థాలు,సోడియం వంటి పోషకాలు తక్కువగా ఉండి విటమిన్స్,ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌, యాంటీ ఆక్సిడెంట్, కాల్షియం పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

సీజన్లో అంజీర పండు రూపంలో లభ్యమవుతుంది, డ్రై ఫ్రూట్ గా ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. అంజీర పండు లేదా డ్రై ఫ్రూట్ గా తీసుకున్న మన శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అంజీర పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంజీర పండులో పుష్కలంగా ఉన్న పొటాషియం రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది.

అంజీర పనులలో ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే క్యాల్షియం ఎముకల దృఢంగా ఉంచి కీళ్లనొప్పి సమస్యలను దూరం చేస్తుంది. ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి నీరసం ,అలసట ,రక్తహీనత సమస్యలను తరిమికొడుతుంది. శరీర వేడి అధికంగా ఉన్నవారు ఉదయాన్నే అంజీర పండ్లను మంచి ఫలితం ఉంటుంది.

అంజీర డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా 3ఫ్యాటీ ఆమ్లం, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లం,సోడియం, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు అంజీర పండ్లను ఆహారంగా తీసుకుంటే మంచిది. షుగర్ వ్యాధిగ్రస్తులు అంజీర పండ్లను తరచూ తింటే వీటిలో ఉన్న ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేసి కోలన్ క్యాన్సర్లను నియంత్రిస్తుంది.

అంజీర పండు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది ఈ పండును ఆహారంగా తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంచుతుంది.నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అంజీర పండు తిని పాలు తాగితే ట్రిప్టోఫాన్‌ హార్మోను ఉత్తేజ పరిచి సుఖనిద్రను కలగజేస్తుంది. శృంగార సమస్యలను దూరం చేయడంలో అంజీర పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది.