కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఉదయాన్నే ఈ జ్యూస్ తాగాల్సిందే?

ప్రకృతి మనకు అందించిన తీగజాతి కాయ కూరల్లో సొరకాయ కూడా ప్రధానమైనదిగానే చెప్పొచ్చు. ఎటువంటి క్రిమిసంహారక మందులు,రసాయనాలు వాడకుండా పండే సొరకాయను ప్రతిరోజు మన ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. సొరకాయతో అనేక రుచికరమైన వంటకాలతో పాటు ప్రతిరోజు ఉదయాన్నే జ్యూస్ రూపంలో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ ,విటమిన్-సి, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

సొరకాయలు అత్యధికంగా పీచు పదార్థం, యాంటీ యాక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ అత్యధికంగా ఉండడం వల్ల ప్రతిరోజు సొరకాయ జ్యూస్ సేవిస్తే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి శరీరంలోని చెడు మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి సొరకాయ జ్యూస్ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.సొరకాయలో ఉన్న యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు మూత్రశయ ఇన్ఫెక్షన్ తగ్గించడమే కాకుండా కిడ్నీ , లివర్, మూత్రాశయం వంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.

సొరకాయలో యాంటీ క్యాన్సర్ గుణాలు,ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండడం వల్ల ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే మన శరీరంలోని క్యాన్సర్ కణాలను నశింపజేసి అనేక క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తుంది. ఉదయాన్నే సొరకాయ జ్యూస్ తాగడం వల్ల వీటిలో సమృద్ధిగా ఉన్న ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.

హై బీపీ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సొరకాయ జ్యూస్ ను సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలను దృఢపరిచి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా హై బీపీ సమస్యను, హార్ట్ డిసీజ్ ను కంట్రోల్ చేస్తుంది. ఉదయాన్నే సొరకాయ జ్యూస్ సేవిస్తే మెదడు చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. మన శరీరానికి తగిన నీటి శాతాన్ని అందించి డిహైడ్రేషన్ సమస్యను తొలగించి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.