ఈ రోజుల్లో చిన్న వయసులోనే శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణం వాతావరణంలో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యం ఒక కారణం అయితే ఆహారపు అలవాట్లు, ధూమపానం మరొక కారణంగా చెప్పవచ్చు. కరానా వైరస్ వచ్చి వెళ్లిన తర్వాత చాలా మందిలో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలను ఎదుర్కొనే వారిలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రత
ముఖ్యంగా ఈ చలికాలంలో శ్వాస సంబంధిత అలర్జీలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ధూమపానానికి దూరంగా ఉంటూ బయటికి వెళ్ళినప్పుడు మాస్కు తప్పనిసరిగా అంతరించాలి. దాంతోపాటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్,యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉన్న చిరుధాన్యాలను, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకున్నట్లయితే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి మనము రక్షణ పొందవచ్చు.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పరిరక్షించే నల్ల మిరియాలను మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నల్ల మిరియాల్లో పుష్కలంగా విటమిన్ సి, యాంటీ అలర్జిటిక్ లక్షణాలు ఉండడం వల్ల ఆహారంలో వీటిని తీసుకుంటూనే ప్రతిరోజు ఉదయాన్నే మిరియాల కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు వంటల్లో వాడే పసుపు లో యాంటీ మైక్రోబియల్ గుణాలు,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.