ప్రతిరోజు నారింజ పండ్లను ఆహారంగా తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో నారింజ పండ్లు కీలకపాత్ర పోషిస్తాయి.అలాగే మన శరీర పోషణకు అవసరమైన అన్ని విటమిన్స్, మినరల్స్ తో పాటు ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్,అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే కొందరి విషయంలో మాత్రం నారింజ పండ్లు కొంత అసౌకర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, ఫైల్స్, మలబద్ధకం,రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారు నారింజ పండ్లను తినే విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి.
నారింజ పండ్లలో జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్ అధికంగా ఉందన్నమాట వాస్తవమే అయితే మన శరీరంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువైతే తిన్న ఆహారం జీర్ణం అవడంలో సమస్య తలెత్తి అజీర్తి,కడుపునొప్పి, ఉబ్బసం, వికారం, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే జీర్ణశక్తి తక్కువగా ఉండేవారు నారింజ పంటను మోతాదుకు మించి అస్సలు తినకూడదు.
ముఖ్యంగా ఒక రోజులు నాలుగు లేదా ఐదు నారింజ పళ్ళను ఆహారంగా తీసుకుంటే వీటిలో అత్యధికంగా ఉండే పొటాషియం కొందరిలో అనారోగ్య సమస్యకు దారితీస్తుంది. పొటాషియం మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పొటాషియం పరిమాణం ఎక్కువైతే హైపర్‌కలేమియా అనే తీవ్రమైన సమస్యకు దారి తీయవచ్చు.
నారింజ పండ్లలో విటమిన్ సి తో పాటు ఆమ్లత గుణాలు ఎక్కువగానే ఉంటాయి. వీటిని టైమ్ ఎంత మోతాదులో తింటే మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. అలాకాకుండా నారింజ పండ్లను ఎక్కువగా తింటే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా ఎసిడిటీ, గ్యాస్టిక్ వంటి సమస్యలతో బాధపడేవారు నారింజ పండ్లను ఎక్కువగా తింటే వీటిలో అధికంగా ఉండే ఆమ్లత్వ గుణాలు సమస్యను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి.