ఒక్కొక్కసారి మనకు ఇష్టమైన ఆహారాన్ని మనస్ఫూర్తిగా, కడుపునిండా తినాలనుకున్న తినలేని పరిస్థితి ఈ రోజుల్లో చాలామందికి కలిగే ఉంటుంది. ఈ సమస్యను కడుపు ఉబ్బరం, లేదా అజీర్తి అంటారు. ఇది కూడా ఒక అనారోగ్య సమస్యే దీన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో జీర్ణ సంబంధిత క్యాన్సర్లతో బాధపడాల్సి వస్తుంది. కడుగు ఉబ్బరం లేదా అజీర్తికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మారుతున్న ఆహారపు అలవాట్లు, ఎక్కువగా శారీరక శ్రమ లేకపోవడం, చాలాసేపు ఒకే చోట కూర్చొని పనిచేయడం ,ధూమపానం, మద్యపానం, పని ఒత్తిడితో సమయానికి తినకపోవడం, అతిగా తినడం,వంశపారంపర్యం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
అజీర్తి ,గ్యాస్టిక్ సమస్యలతో బాధపడేవారు ఏవేవో మందులు వేసుకుని బాధపడే బదులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మన ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సమస్యకు దూరంగా ఉండవచ్చు. మొదట సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గించాలి. ఉప్పును అధికంగా తీసుకుంటే శరీరంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది.
గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు పచ్చి కాకరకాయ రసం తీసి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చిటికెడు సోంపు నీటిలో వేసి బాగా మరిగించిన తర్వాత వచ్చిన కషాయాన్ని ప్రతిరోజు సేవిస్తే అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగి జీర్ణక్రియ రేటు పెరుగుతుంది.
మనకు విరివిరిగా దొరికే నేల ఉసిరి ఆకులను పాలల్లో వేసి బాగా మరిగించిన తర్వాత ఆ పాలను ప్రతిరోజు తాగితే మంచి ఫలితం ఉంటుంది. జీలకర్రను నీటిలో వేసి రసం తీయాలి. ఆ రసాన్ని ప్రతి రోజూ మూడుపూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి.
పచ్చి పసుపు కొమ్ములను పాలల్లో బాగా మరిగించి ఉదయం సాయంత్రం తాగితే జీర్ణ వ్యాధులు తొలుగుతాయి. అలాగే ఎన్నో ఔషధ గుణాలున్న మారేడు ఆకులను తీసుకొని అందులో నాలుగు మిరియాలు కలిపి చూర్ణంగా చేసి సేవిస్తే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్లు దొరుకుతాయి.
కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారు పొటాషియం పుష్కలంగా ఉండే అరటి బొప్పాయి, ఉసరి, బత్తాయి లాంటి పండ్లను ఎక్కువగా మన ఆహారంలో చేర్చుకుంటే మంచిది.