మీరు అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారా.. చక్కటి ఉపాయం మీకోసం?

అధిక శరీర బరువు, చెడు కొలెస్ట్రాల్ సమస్య తో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎన్ని సమస్యలున్నా మన ఆరోగ్యం పై అశ్రద్ధ వహిస్తే జీవిత కాలం పాటు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కాబట్టి మొదట మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తరువాతే ఏదైనా .

ప్రస్తుత రోజులు అధిక కొలెస్ట్రాల్ కారణంగా శరీర బరువు పెరగడం,పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ ఏర్పడి పొట్ట ముందుకు రావడం, గుండె పనితీరు దెబ్బతిని గుండెపోటు, రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటి ముప్పు నుంచి బయటపడాలంటే మొదట మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సాధ్యమైనంత త్వరగా నియంత్రించుకోవాలి దానికి చక్కటి పరిష్కార మార్గం ప్రతిరోజు అత్యధి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబెల్ గుణాలు, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్న గసగసాలను తప్పనిసరిగా రోజువారి ఆహారంలో ఉపయోగించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజు పాలల్లో కొంత గసగసాల పొడిని కలుపుకొని సేవిస్తే వీటిలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్,ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి పొట్ట చుట్టూ ప్రమాదకరస్థాయిలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మనం తీసుకునే ఆహారంలో అప్పుడప్పుడు గసగసాల పొడిని వినియోగిస్తే అతి బరువు సమస్య ను సులువుగా అధిగమించవచ్చు. అలాగే గసగసాల్లో ఉన్న ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ క్యాల్షియం మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభించి కండరాలను ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. నిద్రలేమి సమస్య మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే వారికి గసగసాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.