కంటి సమస్యలతో సతమతమవుతున్నారా… అయితే ఇవి పాటించాల్సిందే!

ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య అధికం కావడంతో వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది అయితే ఇలా పెరిగిన వాతావరణ కాలుష్యం వల్ల అలాగే వాతావరణం లో మార్పుల వల్ల ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతున్నాయి ముఖ్యంగా కంటి సమస్యలతో బాధపడే వారు సంఖ్య కూడా పెరిగిపోయింది. రోజురోజుకీ పెరుగుతున్న గాలి, నీరు కాలుష్యానికి తోడు చల్లటి వాతావరణం కారణంగా మన కళ్ళకు హాని చేసే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు అయినా కళ్ళ కలక, కళ్ళు ఎర్రబడడం, కంటి వాపు, కంటి నుంచి నీరు కారణం వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తోంది. ఇలాంటి కంటి సమస్యలతో బాధపడేవారు ఇతరులకు భౌతిక దూరం పాటించడం మంచిది.

ఇంకా ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా కళ్లకు వచ్చే అలర్జీ లక్షణాలు మన కంటికి హాని కలిగిస్తాయి. కావున మన కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, గుడ్లు ,చేప ప్రతిరోజు ఆహారంలో ఉన్నట్లు చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంతో పాటు విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉండే క్యారెట్ ,బీట్రూట్, నారింజ ,బత్తాయి, ద్రాక్ష జ్యూసులను అదనంగా మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి ఆరోగ్యాన్ని రక్షించడంతోపాటు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని పండు వయసు వారి వరకు ఎక్కువగా సెల్ఫోన్లకు బానిసలుగా మారారు. ఇలా సెల్ఫోన్లను ఎక్కువ సేపు చూడటం వల్ల కూడా కంటి సమస్యలు తలెత్తుతున్నాయి అందుకే వీలైనంతవరకు సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లను పూర్తిగా అవాయిడ్ చేయడం ఎంతో మంచిది. ఇక కంటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం చేపలను ఎక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా బయటకు వెళ్లిన ప్రతిసారి సన్ గ్లాసెస్ ధరించడం ఎంతో మంచిది.