అధిక చెమట, శరీర దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారా. అయితే ఈ చిట్కాలు మీకోసమే?

వాతావరణంలో అధిక వేడి కారణంగా చెమట పట్టి శరీరం మొత్తం తడిసిపోవడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఒక్కోసారి అధిక శారీరక శ్రమ చేసిన, ఒత్తిడిగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు కూడా ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటాయి. నిజానికి చెమటలు పట్టడం అనేది మన ఆరోగ్యాన్ని రక్షించడంలో జరిగే ఓ ప్రక్రియ. వాతావరణం అధిక వేడిగా ఉన్నప్పుడు మన శరీరాన్ని చల్లబడడానికి మన శరీరంలోని వ్యర్ధాలన్నీ తొలగించుకునే ప్రక్రియలో మన శరీరంపై చెమట పట్టి శరీర ఉష్ణోగ్రతలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా క్రమబద్ధీకరించడంలో సహాయపడి డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

చెమట పట్టడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియైనప్పటికీ కొందరిలో మరీ ఎక్కువగా చెమటలు పట్టడంవల్ల మనలో చికాకు కలగడమే కాకుండా శరీరం దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటివారు నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. ఈ చెమట నుంచి వచ్చే దుర్వాసన సమస్యలు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రెండు టేబుల్‌ స్పూన్ల వెనిగర్, టేబుల్‌ స్పూన్‌ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీర దుర్వాసనను తగ్గించుకోవడానికి విటమిన్ సి, జింకు మూలకం అత్యధికంగా ఉన్న పండ్లు కూరగాయలతో పాటు పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు అత్యధికంగా ఆహారంలో తీసుకోవడం వల్ల నోటి దుర్వాసనతో పాటు శరీర దుర్వాసన కూడా తగ్గుతుంది. రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలను మాత్రమే వేసుకోవాలి.చెమటలు ఎక్కువగా పట్టేవారు తడిని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్‌ ,నూలు దుస్తులు మాత్రమే ధరిస్తే మంచిది.