కళ్ళ కింద నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతున్నారా… ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

what-causes-dark-circles-under-eyes

సాధారణంగా ప్రతి ఒక్కరు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అయితే కొందరు కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడటం వల్ల అంద విహీనంగా కనపడుతూ ఉంటారు. ఇలా కళ్ళ కింద నల్లటి వలయాలు,క్యారీ బ్యాగులు రావడంతో ఎంతోమంది ఈ నల్లటి వలయాలను పోగొట్టుకోవడం కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలా కళ్ళ కింద ఏర్పడినటువంటి ఈ నల్లవలయాలు ఎందుకు ఏర్పడతాయి అనే విషయానికి వస్తే…. ఎక్కువసేపు సెల్ ఫోన్లు లాప్టాప్ లు టీవీలను చూస్తూ ఉండటం వల్ల కళ్ళు అధిక ఒత్తిడికి గురై ఇలా కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి.

 

 

ఇక చాలామంది మనం రోజుకు సరిపడా నిద్ర కాకుండా అతిగా నిద్రపోయే వారిలో కూడా ఇలా కళ్ల కింద వలయాలు ఏర్పడటం లేదా ఏర్పడటం జరుగుతుంది.అలాగే నీటిని తక్కువగా తీసుకున్నప్పుడు విటమిన్ కే తక్కువ అయినప్పుడు ఇలా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఏర్పడతాయి.ఇక చాలా మంది మేకప్ వేసుకునే సమయంలో గట్టిగా స్క్రబ్ చేస్తూ మేకప్ వేసుకోవడం వల్ల కూడా కళ్ళు ఉబ్బెత్తుగా ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే తరచూ తాజా పండ్లు కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి.

 

మన ఆహార పదార్థాలలో భాగంగా విటమిన్ కే పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోవాలి. అర్ధరాత్రి వరకు సెల్ ఫోన్ చూడటం వల్ల ఇలాంటి సమస్య మనల్ని వెంటాడుతుంది కనుక వీలైనంత వరకు సెల్ ఫోన్లను పక్కన పెట్టేయాలి.ఇక రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనె లేదా బాదం ఆయిల్ తో కళ్ళను సుతిమెత్తగా మర్దన చేయడం వల్ల అధిక ఒత్తిడి నుంచి దూరమై కళ్ళకింద క్యారీ బాక్స్ ఏర్పడటం ఈ నల్లటి వలయాలు ఏర్పడటం కూడా తగ్గుతుంది.