నిద్రపోవడానికి తెగ కష్టపడుతున్నారా..అయితే ఈ నియమాలు పాటించండి!

నిద్రలేమి సమస్యతో దీర్ఘకాలం పాటు బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన మానసిక వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దానికి తోడు కొంతమంది నిద్ర కలగడానికి నిద్ర మాత్రలకు, డ్రగ్స్,మద్యపానం వంటి చెడు అలవాట్లకు బానిసలుగా మారి మరిన్ని వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. సుఖమైన నిద్ర కోసం ప్రతిరోజు చిన్న చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్యను సహజ పద్ధతిలో అధిగమించవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

మన జీవన విధానంలోనూ, ఆహారపు అలవాట్లలోను భిన్నమైన మార్పులు సంతరించుకున్నాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో అధిక కొలెస్ట్రాల్ ఉన్న జంక్ ఫుడ్ ను, సాఫ్ట్ డ్రింకు వంటివి ఎక్కువగా తీసుకుంటే వీటిలో ఉన్న హానికర కెమికల్స్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మానసిక ఒత్తిడిని కలగజేస్తాయి దాంతో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే ప్రతిరోజు సహజ సిద్ధంగా దొరికే కూరగాయలను, పండ్లను, చిరుధాన్యాలను, మష్రూమ్స్ ను మన ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగితే వీరిలో పుష్కలంగా ఉన్న ప్రోటీన్స్ కొవ్వు అమ్ములు మెదడు కణాలను శాంతపరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.అలాగే రాత్రిపూట సాధ్యమైనంత వరకు కాఫీ, టి,కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఫాస్ట్ ఫుడ్ జీర్ణ వ్యవస్థను మందగించి గ్యాస్టిక్, ఉబ్బసం వంటి సమస్య తలెత్తి నిద్రకు ఆటంకం కలుగుతుంది.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం, వాకింగ్ రన్నింగ్ యోగాసనాలను అలవాటు చేసుకోవాలి.మన పడక గది సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా,శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి.నిద్రపోయే ముందు మనకి ఇష్టమైన సంగీతం వినడం,పుస్తకాన్ని చదవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి తొందరగా నిద్రలోకి జారిపోతారు. అలా కాకుండా అర్ధరాత్రి వరకు వీడియో గేమ్స్ ,మొబైల్స్ , కంప్యూటర్స్ వంటి వాటితో కాలక్షేపం చేస్తే కళ్ళపై ఒత్తిడి పెరిగి మెదడు చురుకుదనం తగ్గడంతోపాటు నిద్రలేమి సమస్య అధికమవుతుంది. మన రోజు వారి ఆహారంలో మేలాటోనియం హార్మోన్ ఎక్కువగా ఉన్న గుమ్మడి గింజలను చియా గింజలను ఆహారంగా తీసుకుంటే నిద్రలేమి సమస్యను తరిమికొట్టవచ్చు.