సాధారణంగా కొబ్బరి నీళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెప్పాలి ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వారికి కొబ్బరి నీళ్లు తాగించడం వల్ల కొంత శక్తిని తిరిగి పొందుతారు.ఇలా కొబ్బరి నీళ్లు మన శరీరానికి ఎంతో శక్తిని కలిగిస్తాయి అయితే చాలామంది కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొన్ని కొబ్బరికాయలలో కొబ్బరి పువ్వు కనబడుతుంది. అయితే ఈ కొబ్బరి పువ్వు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కొబ్బరికాయ మొలకెత్తినప్పుడు కొబ్బరికాయ లోపల తెల్లటి మెత్తటి పువ్వు వంటి పదార్థం ఏర్పడుతుంది దాన్ని కొబ్బరి పువ్వు అంటారు.
కొబ్బరి పువ్వుతినడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇది తినడానికి రుచికి తియ్యగా ఉండి ఎన్నో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. తరచు కొబ్బరి పువ్వును ఆహారంగా తీసుకుంటే ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయేమోనని చాలామంది సంకోచిస్తూ ఉంటారు అయితే నిజానికి కొబ్బరికాయలో ఉండే నీటితో పోలిస్తే కొబ్బరి పువ్వుల్లోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు మరి కొబ్బరి పువ్వు తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….
కొబ్బరి పువ్వులో విటమిన్ సి, ఐరన్, రాగి, జింక్ సమృద్ధిగా ఉండి క్యాలరీలు, కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు దీన్ని ఆహారంగా తీసుకుంటే రక్తనాళాల్లో, నడుము చుట్టూ పొట్ట భాగంలో అధికంగా పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను సమర్థవంతంగా కరిగించి మనల్ని నాజుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ,ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర కణాల సంఖ్యను పెంచుతుంది. కొబ్బరి పువ్వు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించి రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధీకరించడంలో సహాయపడి చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కొబ్బరి పువ్వును తరచూ తింటుంటే థైరాయిడ్ గ్రంథి స్రవించే థైరాక్సిన్ హార్మోన్ నియంత్రణలో ఉంచుతుంది.