సాధారణంగా చలికాలంలో తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. దానికి తోడు కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా వ్యాపిస్తూ ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో చాలామంది సాధారణ దగ్గు ,జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా లక్షణాలు అని భావించి తీవ్ర ఒత్తిడినీ అనుభవిస్తూ డాక్టర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా దగ్గు, జలుబు లక్షణాలు 24 గంటల తర్వాత కూడా తీవ్రంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు వైద్య సలహాలు తీసుకోవడం మంచిది. దగ్గు జలుబు లక్షణాలు కనిపించిన వెంటనే మాస్కు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
జలుబు, దగ్గు లక్షణాలు కనిపించిన వెంటనే గోరువెచ్చని నీళ్లలోకి చిటికెడు రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పునీ నోట్లో వేసుకుని పుక్కిలిస్తే గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజుకి మూడు నాలుగు సార్లు చేస్తే మంచిది.
ఎన్నో ఔషధ గుణాలు ఉన్న లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగితే పసుపులో ఉండే యాంటీ మైక్రోబియన్ గుణాలు గొంతు అలర్జీలను,ఇన్ఫెక్షన్ తగ్గించి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
తీవ్రమైన జలుబు మిమ్మల్ని వేధిస్తుంటే బాగా మరుగుతున్న నీళ్లలో యకాలిస్ట్ స్ ఆయిల్ కలిపి 15 నుంచి 20 నిమిషాల పాటు ఆవిరి పట్టుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. తీవ్రమైన దగ్గు జలుబు సమస్యతో బాధపడుతున్నప్పుడు వీలైనన్ని ఎక్కువ మంచి నీళ్లు తాగాలి అప్పుడే మన శరీరం వ్యాధి కారకాలతో సమర్థవంతంగా పోరాడ గలదు, మరియు శరీరం తొందరగా డిహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. వీటిలో వాము తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీటితో ఆవిరి పట్టుకుంటే గొంతు గరగర తగ్గి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తొలగిపోతుంది. గొంతు వాపు, ఊపిరి తీసుకోవడంలో తీవ్ర సమస్య ఉంటే తక్షణమే వైద్య సలహాలు తీసుకోవడం మంచిది.