మనలో చాలామంది చపాతీలను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే చపాతీలు మృదువుగా లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వాటిని తినే విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చపాతీలు మృదువుగా ఉంటాయి. ఇప్పటివరకు చపాతీలు ఈ చిట్కాలను పాటించి చేయని వాళ్లు ఒకసారి చపాతీల విషయంలో ఈ విధంగా ప్రయత్నిస్తే మంచిది.
చపాతీలను చేయడానికి ముందే గోధుమ పిండిలో తగినంత ఉప్పు కలపడం వల్ల చపాతీలు మృదువుగా ఉంటాయి. కొంచెం నూనె లేదా నెయ్యి పట్టించి చపాతీలను కాల్చడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. నీళ్లు, పాలు చిలకరిస్తూ మెత్తని ముద్దలా చేసిన చపాతీలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. చపాతీలను కనీసం పావుగంట సమయం నాననివ్వాలి.
పిండిని వేళ్లతో నొక్కుతూ మరో 10 నిమిషాలు గట్టిగా కలపడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. గోరువెచ్చని నీళ్లతో పిండిని కలపడం ద్వారా చపాతీలు మరింత మృదువుగా వచ్చే ఛాన్స్ ఉంది. చపాతీలు పామే సమయంలో ఎక్కువ పిండిని ఉపయోగించకూడదు. చపాతీలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మధ్యస్తంగా ఉండే విధంగా తయారు చేసుకుంటే మంచిది.
చపాతీలను మీడియం ఫ్లేంలో కాల్చడం వల్ల చపాతీలు మరింత రుచికరంగా మారతాయని చెప్పవచ్చు. పెనం బాగా వేడిగా అయిన తర్వాత చపాతీలను కాల్చాలి. చపాతీలు సగం కాలిన తర్వాత మాత్రమే వాటిపై నూనె వేయాలి. చపాతీలు తయారైన తర్వాత వాటి పైన మూత పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల చపాతీలు గట్టి పడే అవకాశం అయితే ఉండదు.