కంటిచూపు దృష్టి తగ్గుతోందా.. ఈ ఆహారాలు తింటే ఆ సమస్యలకు చెక్!

కంటి చూపు నిస్సందేహంగా అత్యంత ముఖ్యమైన ఇంద్రియాలలో ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. దృష్టిలోపం జీవన నాణ్యతను, మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును గణనీయంగా తగ్గించే ఛాన్స్ ఉంటుంది. వృద్ధాప్యం లేదా కంటి ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటిచూపు వైఫల్యం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి మన దృష్టి ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.

క్యారెట్లు తినడం వల్ల రాత్రిపూట చూపు వస్తుందని లేదా మానవాతీత దృష్టిని పెంచుతుందని చాలామందికి అవగాహన ఉంటుంది. శాకాహారం, తక్కువ కొవ్వుస చిక్పీస్, బ్లాక్ – ఐడ్ బఠానీలు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. గుడ్లలో జింక్, ఆకుపచ్చని సొన, లుటీన్, జియాక్సంతిన్ ఉండటం వల్ల సులువుగా కంటిచూపు మెరుగుపడుతుందని చెప్పవచ్చు.

మాక్యులాలో రక్షిత వర్ణద్రవ్యం దృష్టిని కాపాడుతుందని చెప్పవచ్చు. బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్, కొల్లార్డ్ గ్రీన్స్ లలో కేలరీలు తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. పొద్దుతిరుగుడు గింజలు, బాదం, నట్స్, వేరుశెనగ వీటిలో విటమిన్ ఇ కంటి శుక్లాలను తగ్గిస్తుంది. ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు రెటీనా పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి.

కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ ఆకుకూరలు, విటమిన్లు సీ, ఈ కెరోటినాయిడ్స్‌లో సమృద్ధిగా ఉంటాయని చెప్పవచ్చు. తియ్యటి బంగాళాదుంపలు, క్యారెట్లు, పచ్చిమిర్చితో సహో కూరగాయలలో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు.