ఈ మధ్య కాలంలో చాలామందిని వేర్వేరు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలు చిన్న సమస్యలలా అనిపించినా దీర్ఘకాలంలో ఇబ్బందులకు గురి చేస్తాయి. ఊపిరి సలపని దగ్గు, ఛాతీలో చెప్పలేనంత అసౌకర్యం, కొంతదూరం నడిస్తే ఆయాసం లాంటి సమస్యలు ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర కాలాలతో పోలిస్తే చలికాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
మధుమేహం లాంటి అన్ని దీర్ఘకాలిక వ్యాధుల్లాగే ఉబ్బసాన్ని కూడా నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆయాసం, పిల్లి కూతలు, దగ్గు, తెమడ పడడం, పడకపోవడం, చిక్కని జిగురులాంటి కళెల, అది శ్వాసనాళాన్ని పోలిన ఆకారంలో ఉండడం ఉబ్బసం ముఖ్యమైన లక్షణాలు అని చెప్పవచ్చు. జామ పళ్లు, వంకాయ వల్ల ఉబ్బసం పెరుగుతుందని చాలామంది భావిస్తారు.
ఉబ్బసం ప్రేరకాలు ఇంట్లో బయటా ఎన్నో ఉంటాయని గుర్తుంచుకోవాలి. డస్ట్ మైట్స్ ఊపిరి ద్వారా శ్వాసనాళాల్లోకి చేరుకోవడం వల్ల కూడా ఉబ్బసం వేధిస్తుంది. ఎక్కువ వాసన కలిగి ఉండే పర్‌ఫ్యూమ్స్, పౌడర్లకు దూరంగా ఉండ్ సర్జికల్ మాస్క్‌లకు బదులుగా సూక్ష్మమైన ధూళిని వడగట్టే ఎన్95 మాస్క్‌లను వాడటం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. అలర్జీ కారణంగా తలెత్తే ఉబ్బసానికి యాంటీ ఐజిఈ అనే మందుతో చికిత్స చేసే అవకాశం ఉంటుంది.
దగ్గు, జలుబు మూడు వారాలకు మించి వేధిస్తుంటే తప్పనిసరిగా పల్మనాలజిస్టు చేత పరీక్షలు చేయించుకుంటే మంచిది. ఉబ్బసాన్ని తీవ్రమైన వ్యాధిలా కాకుండా ఓ అసౌకర్యంగా భావించి, సమయానికి చికిత్స తీసుకోగలిగితే నాణ్యమైన జీవితాన్ని గడిపే ఛాన్స్ ఉంటుంది. సీవోపీడి అని నిర్ధారణ అయితే చికిత్సతో లక్షణాలను అదుపు చేయవచ్చుగానీ, వ్యాధిని అదుపు చేయలేం అని వైద్యులు చెబుతున్నారు.