అల్లం మురబ్బాతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఒక్క ముక్క తింటే చాలు

వర్షాకాలం మొదలవడంతో రోజురోజుకి సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ వర్షాకాలం జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులు తరచూ వేధిస్తూ ఉంటాయి. అయితే ఈ వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంతే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనం తినే ఆహారంలో అల్లం ఎక్కువగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇలాంటి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. అంతేకాకుండా అల్లం ,బెల్లం రెండు కలిపి తయారుచేసే అల్లం మురబ్బా ని ప్రతిరోజు ఒక మొక్క తినటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.

ఈ అల్లం మురబ్బాని మనం ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు. ఇది తయారు చేయటానికి 100 గ్రాముల అల్లం 400 గ్రాముల బెల్లం తీసుకోవాలి. బెల్లంని చిన్న చిన్న ముక్కలు చేసి ఒక గ్లాస్ నీరు పోసి తీగ పాకం వచ్చేవరకు బాగా ఉడికించాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్బిన అల్లం పేస్ట్ అందులో వేసి ఒక నిమిషం పాటు బాగా కలపాలి. తర్వాత ఒక ప్లేట్ లో నెయ్యి పోసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ అల్లం మురబ్బా ముక్కలను ప్రతిరోజు ఉదయం ఒకటి తినటం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

ఈ అల్లంబురప్ప తినడం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాల కారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇక బెల్లంలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరంలో ఎముకలు కండరాలు దృఢంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఒక ముక్క అల్లం మురాబ్బా తినటం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, వికారం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మోకాళ్ల నొప్పులు వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది తినటం వల్ల శరీరంలో దీర్ఘప్రియ మెరుగుపడి చిన్న ఆహారం తొందరగా జీర్ణమయ్యేలా చేసి ఆకలి లేనివారిలో ఆకలి పుట్టేలా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ అల్లం మురబ్బా తినటం అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.