పెరుగుతున్న కాలుష్యం మన ఆహారంలో వస్తున్న మార్పులు వంటి కారరోజురోజుకుణాలతో అనేక చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ రోజుల్లో ముఖ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి చాలామంది బ్యూటీ పార్లర్ లను ఆశ్రయించి డబ్బును , కాలాన్ని వృధా చేసుకోవడంతో పాటు సున్నితమైన చర్మంపై ప్రమాదకర రసాయనాలను దీర్ఘకాలం పాటు వినియోగిస్తే అనేక చర్మ క్యాన్సర్లకు దారి తీయవచ్చు.
ఈ ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని రకాల పదార్థాలతో ముఖ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం. చర్మ సమస్యలను తొలగించడంలో అలోవెరా మొక్క దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అలోవెరా మొక్క గుజ్జులో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ,ఈ వంటి ఔషధ గుణాలు పొడిబారిన చర్మానికి నూతన తేజస్సును ఇవ్వడంలో సహాయపడి చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తుంది. అలోవెరా గుజ్జును వారంలో ఒకసారి ముఖ చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుని కొన్ని గంటలపాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులు మెత్తటి చూర్ణంగా చేసుకొని ఫేస్ ప్యాక్ గా వేసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలను అరికడుతుంది.
బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖంపై మర్దన చేసుకుని కొన్ని నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చర్మంపై ఉండే మలినాలు తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకొని ముఖంపై మర్దన చేసుకుంటే నిమ్మలు ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు అనేక అలర్జీల నుంచి మనల్ని రక్షిస్తాయి. సహజ సిద్ధంగా దొరికే కొబ్బరి నూనెను లేదా బాదం నూనెను చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే చర్మం లోని మృత కణాలను తొలగించి చర్మం మృదువుగా తయారై వృద్ధాప్యఛాయాలను అరికడుతుంది.