పల్లె వాతావరణంలో సహజంగా దొరికే రేగు పండ్లలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయంటే చాలామంది నమ్మకపోవచ్చు. శీతాకాలం సీజన్లో మాత్రమే లభ్యమయ్యే రేగు పండ్లు మన నిత్య జీవక్రియలకు అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తున్నాయి ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్, అమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా కనిపించే రేగి పండు ప్రత్యేకత మన శరీరానికి అవసరమైన 24 రకాల ఆమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండ్లలోనే లభిస్తాయి. ఈ సీజన్లో లభించే రేగి పండ్లను ఆహారంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడాదిలో చలికాలంలో మాత్రమే అందుబాటులో ఉండే రేగి పండ్లను ఆహారంగా తీసుకుంటే ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సీజనల్గా వచ్చే అనేక ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి మనల్ని రక్షిస్తుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని రక్షించి కంటి చూపు ను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మంపై ముడతలు తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. రేగుపండ్లలో కాల్షియం ,ఫాస్ఫరస్ సమృద్ధిగా లభిస్తుంది కావున ఎముకల దృఢత్వానికి తోడ్పడి వృద్ధాప్యంలో వచ్చే కీళ్ల నొప్పులు నడుము నొప్పి ఆర్థరైటిస్ వంటి జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రేగు పండ్ల లో సమృద్ధిగా ఐరన్, జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి ప్రమాదకర రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. రేగుపండ్లలో సమృద్ధిగా లభించే ఫైబర్ , అమైనో ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి తగ్గించి అతి బరువు సమస్యను దూరం చేస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపుమంట, ఆజీర్తి, గొంతునొప్పి, అస్తమా లక్షణాలను దూరం చేస్తుంది.ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటకి పంపి శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రేగి పండ్లను ఈ సీజన్లో మీరు కూడా తినడానికి ప్రయత్నం చేయండి..