సీజనల్ గా దొరికే సీతాఫలం పండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మధురమైన తీపి రుచితో ఉన్న సీతాఫలం పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సీతాఫలం పండ్లతో పాటు సీతాఫలం మొక్క ఆకులు, బెరడులో కూడా మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని ఔషధ గుణాలు, పోషక విలువలు దాగి ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీతాఫలం ఆకులను ప్రతిరోజు కషాయంగా చేసుకొని సేవిస్తే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సీతాఫలం ఆకుల్లో విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్, ఐరన్, క్యాల్షియం, ఫైబర్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. కావున సీతాఫలం ఆకులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లల్లో వేసుకొని బాగా మరగనిచ్చిన తర్వాత వచ్చిన కషాయాన్ని వడగట్టుకుని ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారానికి ముందే సేవిస్తే వీటిలో ఉండే ఔషధ గుణాలు, విటమిన్ సి, ఫైబర్ రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో చక్కగా ఉపయోగపడి మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ ఆకుల్లో ఉన్న యాంటీ మైక్రోబియన్ గుణాలు సీజనల్గా వచ్చే అనేక అలర్జీల నుంచి రక్షణ పొందడానికి తగినంత వ్యాధినిరోధక శక్తిని మనలో పెంపొందిస్తుంది.
గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు తరచూ సీతాఫలం ఆకులను కషాయంగా చేసుకొని సేవిస్తే వీటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించి గుండె జబ్బులను, హైబీపీ సమస్యను తరిమికొడుతుంది. సీతాఫలం ఆకుల్లో ఉన్న యాంటీ క్యాన్సర్ లక్షణాలు మన శరీరంలో ఉన్న క్యాన్సర్ కారక కణాలను నియంత్రిస్తుంది. శరీరంలో చెడు మలినాలను తొలగించి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలను అదుపు చేయడానికి ఆయుర్వేద వైద్యంలో సీతాఫలం ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సీతాఫలం ఆకుల కషాయం కొందరిలో అలర్జీ సమస్య తలెత్తవచ్చు కాబట్టి వైద్య సలహాలు తీసుకొని మంచిది.