సాధారణంగా స్వీట్ కార్న్ తినటానికి ఇష్టపడని పిల్లలు పెద్దలు అంటూ ఎవరూ ఉండరు. అయితే స్వీట్ కార్న్ సినిమా, షాపింగ్ మాల్స్ ,పార్క్ వంటి ప్రదేశాల్లో కాలక్షేపానికి మాత్రమే ఎక్కువగా తింటున్నారు.అలా కాకుండా స్వీట్ కార్న్సును రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన రుచితో పాటు సంపూర్ణ పోషకాలను అందించడంలో ముందుంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. స్వీట్ కార్న్ లో విటమిన్ సి, విటమిన్ బి12, ఐరన్ పోలిక్ యాసిడ్, మాంగనీస్, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం మెగ్నీషియం, కాల్షియం వంటి సహజ మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి.
తరచూ స్వీట్ కార్న్ ఆహారంలో తీసుకునేవారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువ అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్ కార్న్ లో సమృద్ధిగా ఉన్న ఇలాంటి ఆక్సిడెంట్లు ప్రమాదకర క్యాన్సర్లకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి ఉదర , కండరాల, లివర్, బ్లడ్, బోన్ క్యాన్సర్లను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత సమస్యను అధిగమించడానికి స్వీట్ కార్న్ చక్కగా ఉపయోగపడుతుంది .స్వీట్ కార్న్ లో ఉండే ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12, బయోటిన్ గుణాలు రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడంతోపాటు తెల్ల రక్త కణాల సంఖ్యను నియంత్రించడం లో సహాయపడి ప్రమాదకర రక్తహీనత సమస్య దూరం చేస్తుంది.
స్వీట్ కార్న్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరోటినాయిడ్స్ మరియు బయోఫ్లోవనాయిడ్స్ గుండె కండరాలను బలోపేతం చేసి గుండెపోటు ముప్పు నుంచి మనల్ని రక్షిస్తుంది. అలాగే వీటిలో సమృద్ధిగా లభించే పొటాషియం మెగ్నీషియం వంటి మినరల్స్ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును అదుపులో ఉంటుంది. మెగ్నీషియం నాడీ కణ వ్యవస్థను రక్షణ కవచం లో పనిచేసే మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
స్వీట్ కార్న్ లో సమృద్ధిగా పీచు పదార్థం లభిస్తుంది ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించి అతి బరువు సమస్యను దూరం చేస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ దోషాలను సవరించి మలబద్ధకం, అజీర్తి, ఫైల్స్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.