ప్రపంచ దేశాలను వనికిస్తున్న కొత్త స్ట్రెప్ ఎ ఇన్ఫెక్షన్… చిన్నపిల్లల్లో అనారోగ్య లక్షణాలు ఇవే!

ప్రపంచ దేశాలను రెండు సంవత్సరాల పాటు వనికించిన కరోనా మహమ్మారి సృష్టించిన విలయ తాండవాన్ని మరిచిపోక ముందే మనపై ప్రాణాంతక వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేసి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.తాజాగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో స్ట్రెప్ ఎ అనే బ్యాక్టీరియా వ్యాధి ముఖ్యంగా పిల్లలల్లో జ్వరం, చర్మంపై దద్దుర్లు, టాన్సిల్స్, గొంతు నొప్పి, గొంతు దగ్గరి గ్రంథుల వాపు వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది. ఇప్పటికే ఈ వ్యాధి కారణంగా ఈ రెండు దేశాల్లో తొమ్మిది మంది పిల్లలు మరణించారని వైద్య అధికారులు తెలిపారు.వారిలో అధికంగా పదేళ్లలోపు పిల్లలు ఉన్నారు.

అమెరికా, బ్రిటన్ దేశాల అధిపతులు హై అలర్ట్ ప్రకటించి స్ట్రెప్ ఎ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వ్యాధి తీవ్రతను తగ్గించి చిన్నపిల్లల ప్రాణాలను కాపాడాలని వైద్య అధికారులకు సూచించడం జరిగింది. స్ట్రెప్ ఎ అనేది ఒక బ్యాక్టిరియా. ఇది గొంతు, చర్మంపై వస్తుంది. దీని వల్ల తేలికపాటి జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇప్పటికవరకూ.. చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కూడా ప్రాథమికంగా చూపించదు. తరువాత తీవ్రమైన జ్వరంగా, గొంతు ఇన్ఫెక్షన్‌గా మారిపోతుంది.

స్ట్రెప్ ఎ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా ఎదుటివారికి వ్యాపిస్తుంది. ఈ అంటూ వ్యాధితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనుమానం కలిగిన వెంటనే మాస్కు ధరించి వైద్య సలహాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి.అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సూచనల ప్రకారం విపరీతమైన జ్వరం జలుబు లక్షణం, చెమట పట్టడం, అలసట, చిరాకు, డీహైడ్రేషన్,ముఖ్యంగా పిల్లలు టాన్సిల్స్ నొప్పి అంటున్నా, అవి వాచిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.స్ట్రెప్ ఎ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్కు
ఎలాంటి టీకాలు లేవు. అయితే ఈ వ్యాధిపై సమర్థవంతంగా పనిచేయగల యాంటీ బయోటిక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.