తల్లి కావడమనేది పుట్టిన ప్రతి స్త్రీ కోరిక. అలాగే మొదటిసారి తల్లైతే చాలా మంది అజాగ్రత్గా ఉంటారు. అయితే అప్పుడు తీసుకోవలసిన జాగ్రతల్లు అలాగే పాటించాల్సిన ఆరోగ్య నియమాలు చాలానే ఉన్నాయి. చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలని చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనలు వింటూ ఉంటే.. మీరు చాలా అయోమయానికి గురవుతూ ఉంటారు. కానీ ఏం తినాలి, ఏం ఫాలో అవ్వాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే వ్యాయామం, యోగా రెగ్యులర్ గా చేయడం వల్ల… మీరు హెల్తీగా ఉంటారు. కానీ మీ డైట్ లో ఏం చేర్చుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, ఎలాంటి ఆహారాలను డైట్ లో కంపల్సరీ చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి. పండ్లు, వెజిటబుల్స్ ఖచ్చితంగా తినాలి. అలాగే ప్రెగ్నన్సీ టైంలో జ్యూస్ తీసుకోవడం వల్ల మీకు, కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి పోషణ అందుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు హెల్తీ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే జ్యూస్ తీసుకోవడం వల్ల మీ ముఖంలో గ్లోని, ఆనందాన్ని తీసుకొస్తుంది. అయితే ఏ జ్యూస్ తాగితే మంచిది అనే దానిపై చాలామంది అయోమయం ఉంటుంది.
కాబట్టి ప్రెగ్నన్సీ టైంలో తీసుకోవాల్సిన ఫ్రూట్ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం.. యాపిల్ జ్యూస్ ఒక గ్లాసు ఫ్రెష్ గా ఇంట్లో తయారు చేసుకున్న యాపిల్ జ్యూస్ తాగాలి. రెండు లేదా 3 ఆపిల్స్ తీసుకోవాలి. తొక్క తీసి.. ఉడికించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. ఒక గ్లాసులోకి తీసుకుని కొద్దిగా నిమ్మరసం కలపాలి. గంటసేపు ఫ్రీడ్జ్ లో పెట్టుకుని తర్వాత తాగాలి. జామకాయ జ్యూస్ జామకాయ జ్యూస్ ప్రెగ్నన్సీ టైంలో వచ్చే అన్నిరకాల సమస్యలను తగ్గిస్తుంది. రెండు జామకాయలు తీసుకోవాలి, కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి. చల్లారిన తర్వాత జ్యూస్ చేసి, అందులో అల్లం, నిమ్మరసం కలపాలి. కొన్ని ఐస్ క్యూబ్స్ కలిపి తీసుకోవాలి. ద్రాక్ష జ్యూస్ ద్రాక్ష జ్యూస్ ని ఒక గ్లాసు తాగితే చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. 500 గ్రాముల ద్రాక్ష తీసుకోవాలి. క్రష్ చేయాలి. వాటిని బ్లెండర్ వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకోవాలి.
బీట్ రూట్ జ్యూస్ 4క్యారట్లు, 2 బీట్ రూట్స్, 1 యాపిల్ తో.. జ్యూస్ తయారు చేసుకోవచ్చు. అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా ఐస్ మిక్స్ చేసి.. వెంటనే తాగాలి. ఈ జ్యూస్ ని వారానికి మూడు సార్లు తీసుకుంటే మంచిది. ఉత్త బీట్‌రూట్ జ్యూస్ తాగాలంటే తాగలేం కనుక అందులో క్యారెట్, యాపిల్ కలిపితే చాలా బావుంటుంది. అరటిపండు జ్యూస్ అరటిపండు, పెరుగు, తేనె కాంబినేషన్ జ్యూస్ ప్రెగ్నంట్ ఉమెన్ కి చాలా హెల్తీ. అరకప్పు పాలు, అరకప్పు పెరుగు, ఒకటి బాగా పండిన అరిటిపండు, ఒక టేబుల్ స్పూన్ తేనెను మిక్సీలో వేసి.. జ్యూస్ తయారు చేయాలి. దీన్ని చల్లగా తాగితే టేస్టీగా ఉంటుంది.