చైనా మొత్తం కరోనా వైరస్ తో గడగడలాడిపోతుంది. చైనాలో కరోనా మృతుల సంఖ్య పెరిగింది. రోజు రోజుకి వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. వ్యాధి తీవ్రత బాగా పెరిగిపోతుంది. వ్యాధి సంక్రమించినవారు మృత్యువాత పడుతున్నారు. దాదాపు 400 కేసులు వరకు నమోదైన్టలు చైనా ప్రభుత్వం ప్రకటించింది.
ఇక భారతదేశంలో మూడు కరోనా కేసులు నమోదైనట్లు సమాచారం. ఈనెల 18న చైనా నుంచి వచ్చిన కర్ణాటకలోని హుబ్లికి చెందిన వ్యక్తిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో అతడిని ఐసోలేషన్ వార్డులో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఫీవర్, దగ్గు, తలనొప్పితో అతడు బాధపడుతున్నట్లు హుబ్లీ వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే జలుబు, దగ్గు మరియు తీవ్ర జ్వరంతో బాధపడుతుంటారు. ఫిరోజాబాద్ కు చెందిన ఇమ్రాన్ లో కరోనా లక్షణాలు కనిపించడంతో ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ కు తరలించారు.
ఇటీవలె దగ్గు, జలుబుతో ఫీవర్ హాస్పిటల్ లో మరో వ్యక్తి అడ్మిట్ అయ్యారు. ట్రావెల్ హిస్టరీ ఉండటంతో అనుమానితుడిని ఐసోలేషన్ వార్డులో ఉంచామని వైద్యులు తెలిపారు. జనవరి 18 నుంచి ఇప్పటివరకు 2 వేల 733 మంది ప్రయాణికులు చైనా, హాంకాంగ్, థాయి లాండ్, సింగపూర్ హైదరాబాద్ వచ్చినట్లు కేంద్రం గుర్తించింది. వారందరికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. వైరస్ లక్షణాలు లేకున్నా పరీక్షలు మాత్రం తప్పనిసరిగా చేయాలంటూ కేంద్రం సూచించింది.
అదే విధంగా కటక్‌లో కూడా ఎనిమిది మంది అనుమానితులు హాస్పటల్ పాలయ్యారు. అయితే కేవలం ముగ్గుర్ని మాత్రం ఐసోలేటెడ్ వార్డులో వైద్యాన్నిఅందిస్తున్నారు. కర్ణాటకలో 63 మంది అనుమానితుల శాంపిల్లను టెస్ట్ చేయగా.. వారెవరికీ వైరస్ సోకలేదని చెప్పింది ఆరాష్ట్ర ఆరోగ్యశాఖ. ఫ్లూ లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తికి మాత్రం ఐసోలేటెడ్ వార్డులో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపింది. చైనా నుంచి ముంబై ఎయిర్ పోర్టుకు 8 వేల 878 మంది రాగా.. వారందరికి స్క్రీనింగ్ చేశారు. 21 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా.. వారందరినీ వైద్య పరీక్షల నిమితం ఉంచారు.