విజయ్ దేవరకొండ ‘సైలెంట్ మోడ్’ సీక్రెట్ ఇదా?
డియర్ కామ్రేడ్ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఓ రేంజిలో ప్రమోట్ చేసారు విజయ్ దేవరకొండ. అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయలేకోపియంది. నాలుగు భాషల్లోనూ ఈ సినిమాకు ఒకే రిజల్ట్ వచ్చింది. సినిమాకు ఓ రేంజిలో హైప్ రావటంతో …దాన్ని అందుకోలేకపోవటమే కారణం అని విజయ్ దేవరకొండ భావిస్తున్నారట. దాంతో తన తదుపరి చిత్రాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఈ నేపధ్యంలో ఆయన గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కానీ, మీడియా ఇంట్రాక్షన్ లో కానీ కనపడటం లేదు.
విజయ్ దేవరకొండ తదుపరి చిత్రాలపై డియర్ కామ్రేడ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనేది నిజం. బయిట వినపడుతున్న రూమర్స్ ని బట్టి…విజయ్ దేవరకొండ తదుపరి చేయబోయే సినిమా హీరో ఆగిపోయింది. డియర్ కామ్రేడ్ బాగా ఆడి ఉంటే ..ఎంత బడ్జెట్ అయినా ఆ సినిమా పూర్తి చేద్దామనుకున్నారట మైత్రీ మూవీస్ వారు. కానీ సినిమా తేడా కొట్టడంతో ఇప్పటివరకూ తీసిన సీన్స్ ని ప్రక్కన పెట్టి సినిమాని ఆపేద్దామనుకున్నారట. కానీ మీడియాతో ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు విజయ్. మీడియా ముందుకు వస్తే ఖచ్చితంగా అదే ప్రశ్న వస్తుంది.
మరో ప్రక్క నెక్ట్స్ ప్రాజెక్టులు బడ్జెట్ లపై డియర్ కామ్రేడ్ ప్రభావం పడనుంది. దాంతో విజయ్ తో చేద్దామనుకున్న నిర్మాతలు ఆ విషయమై తర్జన బర్జన పడుతున్నారని తెలుస్తోంది. ఇది ఒక రకంగా విజయ్ కు ఇబ్బంది కర పరిస్దితి. ఈ సిట్యువేషన్ లో తన సొంత బ్యానర్ పై ఓ సినిమా ప్రొడ్యూస్ చేద్దామనే డెసిషన్ కు విజయ్ వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటిదాకా ఆయన సైలెంట్ మోడ్ ని కంటిన్యూ చేస్తారట.