ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రిలీజైన కొద్ది సేపట్లోనే సంచలనంగా వ్యూస్ ని రాబట్టుకున్న ఈ ట్రైలర్ అంతటా చర్చనీయాంశంగా మారింది లక్ష్మీ పార్వతి నందమూరి తారక రామారావు జీవితంలోకి ప్రవేశించిన తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు చేసింది.
ఇక ఈ ట్రైలర్ అందరూ చర్చించుకుని హాట్ టాపిక్ గా మారిన అంశం..రామ్ గోపాల్ వర్మ తో పాటు మరొకరి పేరు అగస్త్య మంజు అంటూ అంటూ డైరక్టర్ గా కనపడటం. ఇన్నాళ్ల తన కెరీర్ లో వర్మ ఎప్పుడూ వేరే వాళ్లతో డైరక్టర్ క్రెడిట్ పంచుకోలేదు.
దాంతో ఎవరీ అగస్త్య మంజు అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. వర్మ దగ్గర పనిచేసిన అసెస్టెంట్ అనా అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం అతను ఎడిటింగ్ డిపార్టమెంట్ లో చేస్తూంటాడు. వర్మ గత చిత్రాలకు పనిచేసారు. అతను డైరక్టర్ అవ్వాలని ట్రైల్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో వర్మ ఈ ప్రాజెక్టు అప్పచెప్పారు.
దాంతో అగస్త్య మంజు మొత్తం రీసెర్చ్ వర్క్ చేసారు. అంతేకాక డైరక్షన్ కూడా చేసేసారు. వర్మ కేవలం డైరక్షన్ సూపర్ వైజన్ చేసారు. కీలకమైన కొన్ని షాట్స్ ని వర్మ తీసారని తెలుస్తోంది.. సినిమా ప్రారంభానికి ముందు రిహార్సల్స్ నడపటం నుంచి పూర్తయ్యే దాకా అతనే పూర్తి భాధ్యత తీసుకున్నాడని, ట్రైలర్ కూడా అతనే కట్ చేసాడని తెలుస్తోంది.
ఇక నమ్మితేనే కదా మోసం చేసేది అంటూ మొదలైన ట్రైలర్ ‘నా మొత్తం జీవితంలో చేసిన ఒకేఒక తప్పు వాడిని నమ్మడం’అంటూ ముగయటం నాటకీయంగా బాగుంది.
1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన అనంతరం ఆయన జీవితంలో జరిగిన పరిస్థితులు.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా వచ్చారు.. ఎలాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకున్నారు అనే విషయాలను ట్రైలర్‌లో చూపే ప్రయత్నం చేసారు వర్మ.