విజయ్ దేవరకొండ …ఒక్క ఎపిసోడ్ కి పది కోట్లు

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరస విజయాలతో మంచి జోరు మీద ఉన్నారు. ఆయన మీద రూపాయి ఖర్చు పెడితే వంద రూపాయలు వస్తోంది. దాంతో నిర్మాతలు విజయ్ దేవరకొండ తో సినిమా అనగానే డబ్బులు నీళ్లులా ఖర్చుపెడుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రానికి ‘హీరో’ అనే టైటిల్‌ పెట్టారు.

ఈ చిత్రంలో విజయ్‌ బైక్‌ రేసర్‌గా కనిపించనున్నాడు. రీసెంట్ గా బైక్ రేసుకు సంభందించిన షూటింగ్ జరిగింది. స్టైలిష్ బైక్ రేసింగ్ సీక్వెన్స్ షూటింగ్ కు పది కోట్లు ఖర్చుపెట్టారని సమాచారం. రోజుకు పన్నెండు లక్షలు చొప్పున పదిహేను రోజులు పాటు ఖర్చు పెట్టి మరీ నిర్మాతలు షూట్ చేసారు. మరోసారి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో బహు భాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ చిత్రం ఎంత లేదన్నా 50 బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాతో మలయాళ నటి మాళవిక మోహనన్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. విజయ్‌ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాతో కూడా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఇప్పటికే విజయ్‌ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్ రిలీజ్‌కు రెడీ అవుతుండగా కాంత్రికుమార్ దర్శకత్వంలో మరో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ సెట్స్‌ మీద ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు విజయ్‌.