షాక్ :తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ !

విజయ్ దేవరకొండ వయస్సు ఎంతని..అప్పుడే తండ్రి పాత్ర వేయటం ఏమిటి అంటారా..కాని క్యారక్టర్ డిమాండ్ చేస్తే అందలో ఒదిగిపోవటం మనవాడికి మొదటి నుంచి అలవాటేగా. తాజాగా ’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తుస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ సింగరేణి కార్మికులకు యూనియన్ లీడర్ గా అలాగే మరోవైపు ఎనిమిది సంవత్సరాల అబ్బాయికి తండ్రి గా కనిపించనున్నాడు.

లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ , కాథరిన్ , ఇజబెల్లి కథానాయిలుగా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ చేసింది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ రామారావు నిర్మిస్తున్నారు.

ఇక విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నాడు.

డియర్ కామ్రేడ్ చిత్రాన్ని భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, బిగ్‌బెన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ సరంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి జైకృష్ణ మాటలు రాస్తున్నారు.

రామాంజనేయులు ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: భరత్ కమ్మ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, కెమెరామెన్: సుజిత్ సరంగ్, ఎడిటర్: శ్రీజిత్ సరంగ్, డైలాగ్స్: జైకుమార్, బ్యానర్స్: మైత్రి మూవీమేకర్, బిగ్‌బెన్ సినిమాస్ నిర్మాతలు: నవీన్ యర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చిరుకూరి (సి.వి.ఎం), యస్.రంగినేని.