హాట్ టాపిక్ :‘డియర్‌ కామ్రేడ్‌’ఫిల్మ్ నగర్ టాక్

హాట్ టాపిక్ :‘డియర్‌ కామ్రేడ్‌’ఫిల్మ్ నగర్ టాక్

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నారు. అన్ని భాష‌ల్లోనూ జులై 26నే విడుద‌ల కానుంది డియ‌ర్ కామ్రేడ్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్రం ఫిల్మ్ నగర్ టాక్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఫస్టాఫ్ రేసీగా పరుగెడుతుంది. ఫన్ తో ,క్యారక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ తో సాగుతుంది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కాంప్లిక్ట్ లో పడుతుంది. అంటే అసలు కథ సెకండాఫ్ లో ఉంటుంది. అయితే సెకండాఫ్ ని పూర్తిగా ఎమోషన్స్ నింపేసారని చెప్తున్నారు. అలాగే చాలా స్లోగా సెకండాఫ్ రన్ ఉంటుందని చెప్తున్నారు. అదీ చాలా పెద్దదిగా ఉంటుందని, అది స్పీడ్ చేస్తే బాగుండేదని అంటున్నారు. అయితే ఆ ఎమోషన్ కనుక పడితే కనుక సినిమా అర్జున్ రెడ్డిలాగ పేలుతుందని అంటన్నారు. మల్టిఫ్లెక్స్ లు, ఓవర్ సీస్ ని ఈ సినిమా టార్గెట్ చేసినట్లుందని,, ఓపినింగ్స్ భీబత్సంగా వస్తాయని భావిస్తున్న ఈ చిత్రం లాంగ్ రన్ ని బట్టే రిజల్ట్ అంచనా వేయాలి.

డియర్ కామ్రేడ్ సినిమా ఒకే కాలేజీలో చదువుతున్న ఓ కాలేజ్ స్టూడెంట్ కు, ఓ మహిళా క్రికిటర్ కు మధ్య జరిగే ప్రేమ కథగా చెప్తున్నారు. కాకినాడ టౌన్ లో జరిగే ఈ కథకు టెర్రిఫిక్ సౌండ్ ట్రాక్ పడిందని చెప్తున్నారు.

ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తానంటూ ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌, రష్మిక జంటగా నటించిన చిత్రమిది. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.