ఎప్పుడూ అదే టాపిక్కా .. మీడియా పై దేవరకొండ చిరాకు?

రీసెంట్ గా ఓ మీడియా ఛానెల్ పై విజయ్ దేవరకొండ చిరాకు పడ్డారని సమాచారం. అందుకు కారణం ..వాళ్లు అడిగిన ఒకే ఒక ప్రశ్న..మీరు రెమ్యునేషన్ పెంచారట కదా ఈ మధ్యన అని. దానికి విజయ్ దేవరకొండ కాస్త ఇరిటేషన్ ఫీలయ్యారట. తను కెరీర్ మొదలు పెట్టిననాటినుంచీ కంటిన్యూగా ఇదే ప్రశ్న అడుగుతున్నారని, కొత్తవి లేవా..అయినా నా రెమ్యునేషన్ పెరిగితే మీకు బాధా లేక ఆనందమా…మీకు పెరిగితే మీరు ఆనందపడాలి కానీ చిరాకుపడినట్లు మీడియా సర్కిల్స్ లో వినపడుతోంది.

అయితే విజయ్ దేవరకొండ చిరాకు పడటంలో అయితే తప్పులేదు. ఈ మధ్యన తెలుగులో దాదాపు ప్రతీ మీడియా ఛానెల్ కావచ్చు లేదా వెబ్ సైట్ కావచ్చు లేదా న్యూస్ పేపర్ కావచ్చు..అన్నీ విజయ్ దేవరకొండ రెమ్యునేషన్ పెరిగిందా అంటూ హెడ్డింగ్ లు పెట్టి న్యూస్ లు రాస్తున్నాయి.

2018లో విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం,టాక్సీవాలా,మహానటి సినమాలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ నేపధ్యంలో యూత్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ పీక్స్ కు చేరింది. దానికి త‌గ్గ‌ట్టుగానే త‌న రెమ్యుునేషన్ విష‌యంలో ప‌ట్టు బ‌డుతున్నారు. భారీగానే పెంచటంలో తప్పేముంది.