విజయ్ దేవరకొండపై కొత్త రూమర్, నిజం ఎంత?

స్టార్ హీరోపై రూమర్స్ రావటంలో పెద్ద వింతేమీ కాదు. ముఖ్యంగా తన యాటిట్యూడ్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండపై చాలా మంది కన్ను ఉంది. మీడియా కూడా అతని గురించి రాస్తే, మాట్లాడితే జనం చూస్తారనే ఆలోచన ఉంది. ఈ నేపధ్యంలో గత రెండు రోజులుగా ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది.

ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ వచ్చిన విజయ్ దేవరకొండ దర్శకుల పనిలో వేలు పెడతున్నాడని ఆ వార్త సారాంశం. ఇదివరకు మార్కెటింగ్ వరకే ఇంవోల్వ్ అయిన విజయ్ ఇప్పుడు డైరెక్షన్ లో ఇంవోల్వ్ అవుతున్నాడని అనేస్తున్నారు. గీత గోవిందం తరువాత తన రేంజ్ మారిపోవడంతో విజయ్ కి జాగ్రత్తలు ఎక్కువ అయిపోయాయి. దాంతో దర్శకుల పనిలోను వేళ్లు బాగా పెడుతున్నాడని రూమర్స్ స్ప్రెడ్ అవటం మొదలెట్టాయి.

ఇక తాజా రూమర్ ఏమిటీ అంటే..తన లేటెస్ట్ చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రానికి దేవరకొండ ఓవర్‌గా ఇన్‌వాల్వ్‌ అవుతున్నాడట. ఏ సీన్ ఉండాలో, ఏ సీన్ తీసేయాలి కూడా విజయ్ చెప్పడంతో డైరెక్టర్ భరత్ కమ్మ అలిగి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకి దూరంగా ఉంటున్నాడని టాక్ .

ఈ విషయంలో విజయ్ కొంచెం కూడా కూడా ఫీల్ అవ్వడంలేదట. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడట అయితే డైరెక్టర్ తో గొడవ పడడం లాంటిది చేయకుండా అతనితో టచ్‌లోనే వుంటున్నాడని, ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ ఇస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారని మీడియా అనేస్తోంది. అయితే అలాంటిదేమో లేదని రేపో మాపో దర్శకుడు భరత్ కమ్మా సోషల్ మీడియా ద్వారా స్టేట్మెంట్ ఇచ్చే అకాసం ఉందని తెలుస్తోంది.