మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘మహర్షి’ . పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో, ‘అల్లరి’ నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. రెండు పాటలు కొద్దిగా టాకీ మినిహా షూటింగ్ పూర్తైంది. అంతేకాదు ఉగాదికి ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కథకు సంబంధించిన ఒక వార్త ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో షికారు చేస్తోంది. అదేమిటంటే..
ఈ సినిమాలో మహేష్, పూజా, అల్లరి నరేష్ లు క్లాస్ మేట్స్. అంతేకాదు మంచి స్నేహితులు. కాలేజీ తరువాత మహేష్ అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ లో పడిపోయి మిలియనీర్ గా ఎదుగుతాడు. అల్లరి నరేష్ మాత్రం పై చదువులకు వెళ్లలేక ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోతాడు. ఉన్నట్టుండి నరేష్ మరణించాడని వార్త వస్తుంది. స్నేహితుడి మరణం గురించి తెలుసుకున్న మహేష్..తన ఊరికి వస్తాడు. ‘అల్లరి’ నరేశ్ తన గ్రామానికి చెందిన యువకుడిగా ఒక ఆశయ సిద్ధికోసం పోరాడి చనిపోయాడని తెలుస్తుంది.
దాంతో తన స్నేహితుడి మిగిలిపోయిన ఆశయాన్ని, ‘కల’ను నిజం చేయడం కోసం కోట్ల రూపాయల ఆస్తులను వదులుకోవటానికి సిద్దపడతాడు. ఆ క్రమంలో ఆ ఊళ్లోనే ఉంటూ రైతులకు పనికొచ్చే కొన్ని సంస్కరణలు చేపడతాడు .
ఎన్ని పనులున్నా మహేష్… అక్కడే ఉండి స్నేహితుడు చివరి కోరికను తీరుస్తాడట. అలా ‘అల్లరి’ నరేశ్ పాత్ర మరణంతో కథ కీలకమైన మలుపు తిరుగుతుంది.
కథ ప్రకారం అల్లరి నరేష్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో చనిపోతాడని సమాచారం. అందుకే ఇందులో అల్లరి నరేష్ కోసం హీరోయిన్ లేదని తెలుస్తోంది. ఫస్టాఫ్ ఫన్ తో దుమ్ము రేపిన ఈ సినిమా సెకండ్ హాఫ్ నుంచి కథ చాలా సీరియస్ గా సాగుతుందట. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.