అడివి శేష్ గాళ్ ఫ్రెండ్ సీక్రెట్
క్రేజ్ వుండగానే కెరీర్‌ని చక్కదిద్దుకోవాలి. ఫ్లాపులొస్తే చాలా కష్టం ఇక్కడ. ఈ విషయాన్ని యంగ్ హీరో అడివి శేష్ బాగా వంటబట్టించుకున్నట్టున్నాడు. అందుకే కొత్త పంథాలో సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు అటెన్షన్ తనపైనే ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నాడు. `గూఢచారి` చిత్రంతో డీసెంట్ హిట్‌ని సొంతం చేసుకున్న అడివి శేష్ ఓ హాలీవుడ్ చిత్రాన్ని `ఎవరు` పేరుతో ప్రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ చిత్రం. ఇటీవలే ఎవరు ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. థ్రిల్లర్ సినిమాలో రెజీనా రెచ్చిపోయి అందాల విందు చేయడం యూత్ కి కనెక్టయ్యింది.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలోని కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మిస్టరీని ఛేధించే పోలీస్ ఆఫీసర్‌గా అడివి శేష్ కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే ని తానే అందించాడు. సినిమా టెక్నికల్‌గా అద్భుతంగా కనిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అడివి శేష్ తనని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌కే ఏకంగా కన్ను కొట్టేయడం ఆసక్తికరంగా మారింది. ఇంటర్వ్యూలో భాగంగా తనకు గర్ల్ ఫ్రెండ్ వుందా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అడివి శేష్ కన్నుకొట్టి సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శేష్ ఎంతో జోవియల్ పర్సనాలిటీ. సరదాగా సాగిన ఇంటర్వ్యూలో అతడు ఇలా యాథృచ్ఛికంగా చేసినా కన్ను గీటుడు సన్నివేశం కాస్తా యూత్ లో హాట్ టాపిక్‌గా మారింది.