మహేష్ తన సర్కారు వారి పాట కంటే ఇతని సినిమా గురించి ఎక్కువ కంగారు పడుతున్నాడు ..?

మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మహానటి ఫేం కీర్తి సురేష్ మహేష్ బాబు కి జంటగా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం అయింది. ఈ భారీ షెడ్యూల్ లో ముఖ్యంగా మహేష్ బాబు, కీర్తి సురేష్ మీద కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నెలరోజుల దుబాయ్ లో షూటింగ్ జరపనున్న ఈ సినిమాకి కొంత టాకీ పార్ట్ తో పాటు సాంగ్స్ ని కంప్లీట్ చేయనున్నారు.

మహేష్ బాబు ఇలా భారీ సినిమాలలో నటిస్తూనే మంచి కథలతో సినిమాలని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోనీపిక్స్ తో కలిసి మహేష్ బాబు మేజర్ అన్న సినిమా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టాలెంటెడ్ హీరో అడవి శేష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటి సాయీ మంజ్రేకర్ .. తెలుగమ్మాయి శోబిత ధూళిపాళ్ళ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మహేష్ బాబు సతీమణి ఈ సినిమాకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుందట. ఇంతక ముందు ‘గూఢచారి’ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శశి కిరణ్ తిక్కా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ సినిమాగా మేజర్ రూపొందుతుండగా తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘మేజర్’ సినిమాని జూలై 2వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉన్ని కృష్ణన్ గెటప్ లో ఉన్న శేష్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే తన సర్కారు వారి పాట కంటే మహేష్ ఈ సినిమా గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.