Adavi sheh : మేజర్ సినిమా విడుదల వాయిదా….!

Adavi Sheh : విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో అడవి శేష్. అందరి కుర్రహీరోల్లాగా లవ్ స్టోరీలు, మాస్ సినిమాలు అంటూ చేయకుండా కథకు ప్రాధాన్యమున్న విభిన్న కథాంశాలను ఎంచుకుంటున్నాడు. సొంతం సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన అడవి శేష్ ఆ తరువాత కిస్ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గూఢచారి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఇక అడవి శేష్ తాజా గా నటిస్తున్న చిత్రం మేజర్. ముంబై దాడుల్లో మరణించిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం శశి కిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అంతర్జాతీయ సంస్థ సోనీ పిక్చర్స్ ఇండియా జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాను మే 27 న విడుదల చేయడానికి సిద్ధం చేసారు.

అయితే అదే రోజున వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ f3 విడుదల కాబోతోంది. దీంతో మేజర్ సినిమా యూనిట్ విడుదల తేదిని వారం రోజులకు వాయిదా వేసి జూన్ 3 తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే జూన్ 3 తేదీన కమల హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా, అక్షయ్ కుమార్ పృథ్వీ రాజ్, అజయ్ దేవగన్ మైదాన్ సినిమాలు రానున్నాయి. ఇక ఈ చిత్రాలతో మేజర్ సినిమా పోటీపడాల్సి ఉంది.