ముదురే…సాయి పల్లవి ని ట్రాక్ లో పెట్టాడే?

గత కొంతకాలంగా సాయి పల్లవి, తమిళ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తోందంటూ అక్కడ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే అందులో నిజం లేదంటూ ఇద్దరూ కొట్టిపారేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు సాయిపల్లవి ని తన ప్రాజెక్టులోకి ఒప్పించాడని , ఆ విధంగా తన ప్రాజెక్టుకు హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. తెలుగు,తమిళ భాషల్లో సాయి పల్లవి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ విషయం దర్శక,నిర్మాతలకు తెలుసు. అందుకే ఆమెను తమ సినిమాల్లో తీసుకోవాలనని ఎవరికి వారే ఉత్సాహం చూపెడుతున్నారు. తాజాగా తమిళ దర్శకుడు ఎల్.ఎల్ విజయ్ సైతం అదే స్కెచ్ వేసారు. ఆయన ఇప్పుడు జయలలిత జీవితం ఆధారంగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో జయ పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ను ఎంపిక చేసుకున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఈ చిత్రంలో జయలలిత స్నేహితురాలైన శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు తమిళ వర్గాల సమాచారం. దీని గురించి చిత్రం టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె నటించిన ‘పడి పడి లేచె మనసు’, తమిళంలో నటించిన ‘మారి’ చిత్రాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. మరోపక్క సూర్యతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె జయ బయోపిక్‌కు కమిటవ్వుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇక దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాధారంగా బయోపిక్‌ తెరకెక్కించాలని తమిళ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తమిళంలో ‘ది ఐరన్‌ లేడీ’ పేరిట జయపై ఓ సినిమా రాబోతోంది. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామేనన్‌ నటిస్తున్నారు.