రానా ‘విరాటపర్వం’లీకైన స్టోరీ..ఇంట్రస్టింగ్

రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా పొలిటికల్ థ్రిల్లర్ విరాటపర్వం సినిమా మొదలైన సంగతి తెలిసిందే. నీదీ నాది ఒకటే కథ వంటి డిఫరెంట్ సినిమాతో పరిచయమైన దర్శకుడు వేణు ఊడుగల డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. దాంతో ఈ చిత్రం కథ ఏమై ఉంటుందనే డిస్కషన్ ఫిల్మ్ సర్కిల్స్ లో మొదలైంది.

ఈ నేపధ్యంలో విరాట పర్వం స్టోరీ లైన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి రిపోర్టర్‌గా.. రానా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఓ సందర్భంలో సాయి పల్లవి… రానాను ఇంటర్వ్యూ చేస్తుందని… అప్పుడు రానా ఆమె ప్రేమలో పడి నక్సలిజాన్ని వదిలేస్తాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలక్షన్స్‌లో కూడా పోటీ చేసి వార్డ్ మెంబర్‌గా గెలుస్తాడట. ఇక హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను దర్శకుడు సహజ సిద్ధంగా చూపిస్తాడని టాక్. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించనుంది. విరాట పర్వం చిత్రాన్ని సురేష్ బాబు భారీస్థాయిలో నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత రానా భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకశ్యపలో నటించాల్సి ఉంది.