రాశిఖన్నా విజయ్ దేవరకొండతో హద్దులు మీరుతొందా!?

Raashi Khanna role in world famous lover
అవును.. నిజమే! ఇప్పటి వరకూ హద్దు మీరని గ్లామర్ పాత్రలు చేసిన రాశిఖన్నా విజయ్ దేవరకొండతో చేస్తున్న’వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో హద్దులు దాటడంపై ఇండస్ట్రీ విస్తుబోతోంది. కెరీర్ బిగినింగ్ నుంచీ స్కిన్ షోకి దూరంగా ఉన్న రాశి, సినిమా టీజర్‌లో టాప్‌లెస్ బ్యాక్ చూపించటమే కాదు, విజయ్‌తో శృతిమించిన రొమాన్స్ చూపించింది.
 
ఇప్పటి వరకూ స్టార్ హీరోలతో సినిమాలు చేసినా ఏ చిత్రంలోనూ రాశి హద్దు దాటలేదు. ఈమధ్య చేసిన వెంకీమామ, ప్రతిరోజూ పండగేతో హిట్లందుకుని కెరీర్ గాడిలో పడుతున్న టైంలో గ్లామర్‌కు తెర లేపటంపై ఆశ్చర్యం కలుగుతుంది. రెండు హిట్లుకొట్టిన రాశికి మంచి ప్రాజెక్టులు వచ్చే అవకాశముంది. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్‌లో శృతిమించిన గ్లామర్ రోల్ చేయడం  భవిష్యత్తులో స్టార్ హీరోల సరసన చాన్స్‌లు వచ్చే అవకాశం కోల్పోయినట్టేనన్న చర్చ మొదలైంది.
 
బోల్డ్ ఇమేజ్ పడిన హీరోయిన్లకు చాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపించటం లేదు. ఇవన్నీ పట్టించుకోకుండా రాశిఖన్నా.. ఎందుకు అంత బోల్డ్ పాత్రను ఎంచుకుందన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. అయితే, వెంకీమామ, ప్రతిరోజూ పండగే చిత్రాలకు ముందే విజయ్‌తో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి రాశిఖన్నా సైన్ చేసింది. అవకాశాల కోసం అప్పుడు బోల్డ్ పాత్రను ఎంపిక చేసుకోవడం, ఇప్పుడు కెరీర్‌కు ముప్పు తేవొచ్చన్న మాట వినిపిస్తోంది.
 
విజయ్ దేవరకొండ క్రేజ్ చూసి డబ్ల్యుఎఫ్‌ఎల్ చిత్రానికి సైన్ చేసిన రాశిఖన్నా  ఈ సినిమా వర్కౌట్ కాకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చన్న మాట వినిపిస్తోంది 
 
Raashi Khanna role in World Famous Lover
 
Raashi Khanna is playing a glamorous role in world famous lover. Raashi Khanna accepted the role in world famous lover due to the presence of Vijay D.