హాట్ బాంబ్‌పై మనసు పారేసుకున్న నిర్మాత
నటించిన తొలి సినిమాతోనే కుర్రాళ్లలో హాట్ టాపిక్ గా మారింది అమ్మడు. సినిమా ఆద్యంతం వేడెక్కించే సన్నివేశాలతో స్క్రీన్ ని హీటెక్కించింది. థియేటర్లలో కుర్చీలన్నీ పొగలు కక్కాయి. ఈ అమ్మడు వన్నె చిన్నెలు.. వయ్యారాల వడ్డనలు చూశాక యూత్ కంటిపై కునుకు పట్టక పరేషాన్ అయ్యారు. అంత ప్రభావం చూపించిన ఈ అమ్మడిపై టాలీవుడ్ దృష్టి పూర్తిగా మళ్లింది. ఎడాపెడా అమ్మడితో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని నిర్మాతలంతా ఆరాటపడినా సదరు భామ మాత్రం మరోసారి ఓ బోల్డ్ సినిమాకి సంతకం చేసి ఆశ్చర్యపరిచింది. ఒక అగ్ర హీరో సరసన ఛాన్స్ మాటేమో గానీ.. దాంతో పాటే రెండో సినిమాకే పూర్తిగా తనపైనే నడిచే బోల్డ్ కథను ఎంచుకుని షాకిచ్చింది అమ్మడు. కానీ అందులో కంటెంట్ పై టీజర్ చూసిన వెంటనే విమర్శకులు చెడామడా తిట్టేశారు. బోల్డ్ డస్కీ ఎక్స్ పోజింగ్ తప్ప ఇంకేదీ కంటెంట్ లో కనిపించలేదని తిట్టారు క్రిటిక్స్.
అన్నట్టు అంతగా మ్యాటర్ లేని ఈ సినిమాకి ఈ సెక్సీ బ్యూటీ ఎందుకు అంగీకరించింది? అంటే .. తనకు ముట్టజెబుతున్న పారితోషికం రేంజ్ అలా ఉందని తెలుస్తోంది. దాదాపు కోటి పైగానే ముట్ట జెప్పడం వల్లనే ఈ ప్రాజెక్టుకు సంతకం చేసిందని ఫిలింనగర్ లో ముచ్చటించుకుంటున్నారు. అయినా తొలి చిత్రానికి 5లక్షలు అయినా అందుకోని ఈ బ్యూటీకి అంత పెద్ద మొత్తం ఎలా ముట్టజెబుతున్నారు? అంటే దానివెనక ఓ టాప్ సీక్రెట్ ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రూ.50లక్షల వరకూ పారితోషికం.. ఇతరత్రా పైకం మాత్రం సంథింగ్ సీక్రెట్ రీజన్ అన్న టాక్ వినిపిస్తోంది. సదరు నిర్మాత ఎంతో మోజుపడితే కానీ అంత పెద్ద మొత్తం వదిలించుకోవడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా యువకథానాయిక.. ఎవరా సీనియర్ నిర్మాత అన్నది మీరే గెస్ చేయండి.