ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్‌కుమార్ బర్జాత్య ముంబైలో కన్నుమూశారు. రాజశ్రీ ఫిలిం ప్రొడక్షన్స్‌పై ప్రేమ్ రతన్ ధన్‌పాయో( 2015), జానా పెహ్‌చానా(2011), లవ్ యూ.. మిస్టర్ కళాకర్(2011), ఇసి లైఫ్ మైనే (2010), ఏక్ వివాహ్..ఐసా భాయ్ (2008), షాసు ఘర చాలిజిబి(2006), వివాహ్ (2006), మైనే ప్రేమ్ కీ దివానీ హూన్( 2003), హమ్ ప్యార్ తుమ్హీ సే కార్ బైతే(2002), హమ్ సాత్- సాత్ హైన్: వుయ్ స్టాండ్ యునైటెడ్(1999), హమ్ ఆప్‌కే హై కౌన్( 1994) చిత్రాలని నిర్మించారు.
1989లో వచ్చిన మైనే ప్యార్ కియా వంటి సూపర్ హిట్ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు.హమ్ ఆప్‌కే హై కౌన్ చిత్రానికి రాజ్‌కుమార్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆయన మృతికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నివాళులు అర్పిస్తుంది. రాజ్ కుమార్ బర్జాత్య ఆత్మకి శాంతి కలగాలని సినీ ప్రముఖులు ప్రార్దించారు.