రకుల్‌ప్రీత్‌సింగ్ ఏం చేసినా తెలుగులో కలిసి రావడం లేదు. ముదురు హీరో నాగార్జునతో కలిసి మన్మథుడు-2లో రొమాన్స్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తన ఫోకస్‌ని బాలీవుడ్‌కు షిఫ్ట్ చేసింది. మరి బాలీవుడ్ మేకర్స్‌ని, హీరోలని ఆకట్టుకోవాలంటే దక్షిణాదిలా వుంటే సరిపోదు. ఏదో కొత్తగా ట్రైచేయాలి. సోసల్ మీడియాని హీటెక్కించాలి. ఇప్పడు రకుల్ అదే పనిలో చాలా బిజీ అయిపోయింది. బాలీవుడ్‌లో రాణించాలంటే అక్కడి వారిచ్చే పోటీని తట్టుకోవాలి. వారి ఫ్యాషన్‌కు తగ్గట్టుగా రెడీ అయిపోయి కాక పుట్టించాలి. అందుకే రకుల్ తన ఇన్‌స్టా పేజీని హాటెక్కించ్చేస్తోంది.
బాలీవుడ్‌లో మరింతగా తన కెరీర్ రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగిపోవాలని భావిస్తున్న రకుల్ రెడ్ ఔట్ ఫిట్‌లో కేక పుట్టిస్తోంది. పోనీ టేల్ హెయిర్ తో, డ్రెస్‌కి తగ్గ మేకప్‌తో రెడ్ డ్రెస్‌లో రకుల్ మరింతగా మెరిసిపోతూ హోయలు పోతున్న లుక్ ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది. అ పిక్ చూసిన కుర్రకారంతా ఎర్రా కలువా పువ్వా ఏద్దామా చలిమంట అంటూ ఊగిపోతున్నారు. దే దే ప్యార్ దే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని తన లేలేత అందాలతో కనువిందు చేసి తాను ఎలాంటి పాత్రకైనా సిద్ధమనే సంకేతాలిచ్చింది. ప్రస్తుతం రకుల్ చేతిలో వున్న హిందీ చిత్రం మర్జావా. రితేష్ దేష్‌కుఖ్, సిద్ధార్ధ్ మల్హోత్ర, తారా సుతారియాతో కలిసి రకుల్ నటించిన ఈ చిత్రం నవంబర్ 8న రిలీజ్ కాబోతోంది.
