సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తారు. అయితే ఫ్లాఫ్ సినిమాకు కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తానంటున్నాడు ఓంకార్. హారర్ చిత్రంగా విడుదలైన రాజుగారి గది అప్పట్లో చాలా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఓంకార్‌కి దర్శకుడిగా మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టిన ఈ సినిమాకు సీక్వెల్ చేసారు. కొంచెం భారీగా. నాగార్జున, సమంత వంటి స్టార్స్ కూడా కలిసి ఓంకార్ తెరకెక్కించారు. అయితే ‘రాజుగారి గది 2’ వర్కవుట్ కాలేదు. రిలీజ్ కు ముందు వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేక చతికిల పడింది.
అయితే ఓంకార్ ..వెనకడుగు వేసేటట్లు లేరు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా రాజుగారి గది 3ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌ను కూడా ఓంకార్ డైరెక్ట్ చేస్తాడట. ఇందులో తమన్నాను మెయిల్ లీడ్‌గా నటింప చేయడానికి సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఎప్ 2 సక్సెస్ తర్వాత తమన్నాకు మళ్లీ డిమాండ్ వచ్చేసింది. దాంతో తమన్నా తన రెమ్యునేషన్ కోటిన్నర దాకా డిమాండ్ చేస్తోందిట. ఇది కనుక నిర్మాతలు ఓకే చేస్తే ప్రాజెక్టు ప్రారంభమైపోతుంది. అయితే ఫ్లాఫ్ సినిమాకు తీసే సీక్వెల్ అంత క్రేజ్ తెచ్చుకుంటుందా అంటే ఖచ్చితంగా సినిమా పబ్లిసిటీలో ఆ తేడా చూపిస్తాం వర్కవుట్ చేస్తాం అంటోంది టీమ్. చూద్దాం…ఏం జరగనుందో..
