(మోహన్ )
తొలి చిత్రం `జెంటిల్‌మేన్`తోనే తెలుగు హృదయాలను కొల్లగొట్టేసిన మలయాళ బ్యూటీ నివేదా థామస్. తాజాగా ఆమె 118లో నటించింది. ఇందులో క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల్లో మాత్రమే తాను కనిపిస్తానని ముందు నుంచే అందరినీ ప్రిపేర్ చేసింది. అయితే నివేదా అన్నట్టు ఆమె కనిపించింది 20 నిమిషాలే.
కానీ సినిమా మొదటి నుంచి చివరి వరకు అంతా ఆమె గురించి జపం చేశారు. ఆ పాత్ర కోసమే ఆరాటపడ్డారు. మెయిన్ కథానాయికగా షాలినీ పాండే ఇందులో నటించింది. నిజం చెప్పాలంటే హీరో పక్కనున్న షాలినీ పాండే కన్నా, హీరో ఊహల్లో ఉన్న నివేదాకే సినిమాలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది.
118 చూసిన వాళ్లందరికీ కల్యాణ్ రామ్, షాలినీ పాండే కన్నా నివేదానే హీరోగా కనిపిస్తుంది.
సో జై లవకుశ తర్వాత చదువుల కోసం గ్యాప్ తీసుకున్న నివేదాకి కమ్ బ్యాక్ సినిమాగా `118` మంచి పేరే తెచ్చిపెట్టింది. అంటే కేవలం పాత్ర నిడివి చూసుకుని `నేను చేయను చల్` అని ఉంటే ఆమెకు ఇంత క్రేజ్ దక్కకపోయేది. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం నివేదా కెరీర్‌కు ప్లస్ అయింది.