వకీల్ సాబ్ నుంచి మళ్ళీ డిసప్పాయింట్ న్యూస్ ..?

వకీల్ సాబ్ సినిమా నుంచి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాని వకీల్ సాబ్ నుంచి ఆ టీజర్ మాత్రం రావడం లేదు. దిల్ రాజు ఎంతో కసిగా ఈ సినిమాని బడ్జెట్ గురించి వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మేకర్స్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వకీల్ షూటింగ్ ఇప్పటి వరకు సజావుగా సాగలేదు. ఎప్పుడు ఏదో ఒక కారణంతో షూటింగ్ కి బ్రేక్ పడుతూనే ఉంది. ఎట్టకేలకి షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. జనవరి నెలఖారుకల్లా వకీల్ సాబ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంటున్నారు.

Vakeel Saab' team resumes shoot without Pawan Kalyan | The News Minute

ఈ క్రమంలో వకీల్ సాబ్ సినిమా నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టీజర్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1 న రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. దాంతో అందరూ తెగ ఆనందపడ్డారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఫ్యాన్స్ కి మళ్ళీ డిసప్పాయింట్‌మెంట్ తప్పదని తెలుస్తోంది. జనవరి 1 న వకీల్ సాబ్ సినిమా నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చే అవకాశాలు లేవంటున్నారు. వీలైతే సంక్రాంతి పండుగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అయితే అది కూడా ఖచ్చితంగా తెలియడం లేదు.

మరి ఎందుకు వకీల్ సాబ్ టీం ఇంతగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తున్నారన్నది అర్థం కావడం లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ కూడా ఏప్రిల్ 9 న అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతమాత్రం వాస్తవం ఉందన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. కాగా వకీల్ సాబ్ బాలీవుడ్ సినిమా పింక్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శృతిహాసన్ మూడవ సారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తోంది.