బ‌న్ని టైటిల్ ఐడియా కొట్టేశాడుగా

 
నా పేరు సూర్య త‌ర్వాత స్టైలిష్ట్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్ని ఓ మంచి కాన్సెప్ట్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి చాలా స‌మ‌యాన్నే తీసుకున్నాడు.
 
ఈ క్ర‌మంలో విక్ర‌మ్ కుమార్ చెప్పిన లైన్ న‌చ్చి క‌థ డెవ‌ల‌ప్ చేయ‌మ‌న్నాడు. క‌థంతా విన్న త‌ర్వాత బ‌న్ని ఈ సినిమాకు గ్యాంగ్ లీడ‌ర్ అనే టైటిల్ కూడా బావుంటుంద‌నే సూచ‌న కూడా చేశాడు.
 
ద‌ర్శ‌క నిర్మాత‌లు బ‌న్ని ఐడియానే ఫాలో అయిపోయారు. కానీ చివ‌ర‌కు ఆ ప్రాజెక్ట్ నుండి బ‌న్ని త‌ప్పుకున్నాడు. నాని వ‌చ్చి జాయిన్ అయ్యాడు. చిరంజీవికి ఫ్యామిలీ ఆడియెన్స్‌, మాస్ ఇమేజ్‌ను పెంచిన చిత్రాల్లో గ్యాంగ్ లీడ‌ర్ ఒక‌టి. ఆ సినిమా టైటిల్‌ను నాని పెట్టుకుని చాలా తెలివైన ప‌ని చేశాడు. ప్ర‌స్తావించాల్సిన మ‌రో విష‌య‌మేమంటే.. టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యంలో కూడా నాని చిరంజీవి గురించి పొగుడుతూ ఆకాశానికెత్తేశాడు.. ఆయ‌న అభిమానిగా గ‌ర్వ‌ప‌డుతున్నానంటూ కూడా చెప్పుకొచ్చాడు.
 
ఇలా మెగాభిమానుల‌ను కూడా మెనేజ్ చేసేశాడు. నాని, విక్ర‌మ్‌కుమార్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `గ్యాంగ్ లీడ‌ర్‌`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ టీజ‌ర్ చూస్తుంటే ఐదుగురు ఆడ‌వాళ్ల‌కి లీడ‌ర్‌గా నాని ఏం చేశాడ‌నేదే క‌థ‌గా క‌న‌ప‌డ‌నుంద‌ని తెలుస్తుంది.