అనుష్క కోసం సీన్ లోకి హాలీవుడ్ స్టార్ హీరో

ప్రతిష్టాత్మకంగా రూపొంది ఘన విజయం సాధించిన బాహుబలి 2 రిలీజ్ తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుంది. ఆమె అలా గ్యాప్ తీసుకోవడంపై మీడియా లో రకరకాల వార్తలువచ్చాయి. అనుష్కకు ఆరోగ్యం బాగాలేదని కొందరు రాసేస్తే… పెళ్లి చేసుకోబోతున్నదని అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని మరికొన్ని రూమర్స్ పుట్టించారు. ఈ రూమర్స్ ను బ్రేక్ చేస్తూ.. అనుష్క సైలెన్స్ అనే సినిమాతో సైలెంట్ గా సమాధానం చెప్పింది.

ఇక ఈ సినిమాలో అనుష్క పాత్ర అరుంధతి, భాగమతి మించిన పాత్రలా ఉంటుందట. మాధవన్ ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. కథకు అనుగుణంగా ఈ సినిమా ఎక్కువభాగం యూఎస్ లో జరుగుతుందని చెప్తున్నారు. కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు హేమంత్ మధుకర్ దర్శకుడు.

ఇక ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో కిల్ బిల్ ఫేం ‘మైఖేల్ మాడ్సన్’ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో జరగటంతో ..అక్కడి ఆయన పాల్గొంటాడట. హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఇంట్రస్ట్ ని పెంచేస్తోంది. కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే విషయంపై అందరూ ఆసక్తి చూపుతున్నారు.