ఫైనల్ గా టీడీపి ని దెబ్బ కొట్టడానికి వర్మ ఆ ఆప్షన్ ?

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హైకోర్టు ఇచ్చిన స్టే విధింపుపై దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందే విడుదల చేయాలనే దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత రాకేష్ రెడ్డి ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఈ చిత్రం విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.

హైకోర్ట్ లో తీర్పు వచ్చాకే సుప్రీం కోర్ట్ కు రమ్మనమని నిర్మాతను న్యాయస్దానం ఆదేశించింది. ఏప్రియల్ 3న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ జడ్జి ఈ సినిమా ని తన ఛాంబర్ లో చూస్తారు. అప్పుడు ఆయన తన తీర్పు చెప్తారు. దాన్ని బట్టి ఏప్రియల్ 5న విడుదల అవుతుందా లేదా అనేది తేలుతుంది. ఇక ఏప్రియల్ 5 న కాకపోతే ఎలక్షన్స్ అయ్యాక అంటే వచ్చేవారం ఏప్రియల్ 12న రిలీజ్ చెయ్యాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమా నుంచి ఆశించే ఎలక్షన్ ఫలితం అందదు.

ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాశంగా మారింది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు…ఏప్రియల్ 5 వ తేదీ కనుక మిస్సైతే..అమెజాన్ ప్రైమ్ లో లేదా టీవిలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు వర్మ ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఎలాగైనా ఈ సినిమాని ఎపి ప్రజల దగ్గరకు తేవాలనేది ఆయన ఆలోచనగా ఉందని తెలుస్తోంది.

వర్మ మాట్లాడుతూ… లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయంపై పేర్లు వెల్లడించను. హైకోర్టు స్టే విధించినందున నేనేమీ మాట్లాడను. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతాను అన్నారు.